
నన్ను జైల్లో పెట్టుకుంటారా ……. పెట్టుకోండి మోడీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పేరు ఉందని నిన్న రాత్రి ఈడీ వెల్లడించిన నేపథ్యంలో ఈరోజు ఉదయం మీడియా ముందుకు వచ్చింది కవిత. తెలంగాణలో వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నందునే మోడీ కంటే ముందు ఈడీ వచ్చిందని దుయ్యబట్టింది. మోడీ ప్రభుత్వం వచ్చి 8 ఏళ్ళు దాటింది.
ఈ ఎనిమిదేళ్ల కాలంలో 9 రాష్ట్రాల్లో ప్రజలచేత ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేసి భారతీయ జనతా పార్టీ అడ్డదారిలో అధికారంలోకి వచ్చిందని , ఇక తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఈడీని ప్రయోగించారని , మీరు ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని ……. నన్ను జైల్లో పెట్టాలనుకుంటే పెట్టుకోండి అంటూ సవాల్ విసిరింది ఎమ్మెల్సీ కవిత.