పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ఊహాగానాలు చెలరేగాయి. అయితే తెలంగాణ సామాజిక కాంగ్రెస్ పార్టీ స్థాపించనున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేసారు కొంతమంది. దాంతో అది దావానలంలా మారింది. ఇక కాంగ్రెస్ శ్రేణులు వార్త పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే రేవంత్ రెడ్డి అనుచర వర్గం పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని , కొత్త పార్టీ పెట్టడం లేదని , అవన్నీ గాలి వార్తలే ! అని కొట్టి పడేసారు. ఈ వార్తలను కావాలని వైరల్ అయ్యేలా చేసిన వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కోరారు.
గతకొంత కాలంగా సీనియర్లకు రేవంత్ రెడ్డి కి పొసగడం లేదు. దాంతో కాంగ్రెస్ పార్టీలో ఉండి లాభం లేదు కాబట్టి తెలంగాణ సామాజిక కాంగ్రెస్ పార్టీ స్థాపించనున్నట్లు ఊహాగానాలు వచ్చేలా చేసారు. అసలే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి సమయంలో సీనియర్లు జూనియర్లు అంటూ పార్టీ మరింత పలుచన అవుతోంది. దాంతో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.