తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని తన ఇంటి నుండి మేడారంకు ఈరోజు ఉదయం బయలుదేరాడు. రేవంత్ రెడ్డికి తన కూతురు , సోదరి కలిసి హారతి ఇచ్చి యాత్ర విజయవంతం కావాలని శుభాకాంక్షలు అందజేశారు. ఆడపడుచుల ఆశీర్వాదం అందుకున్న రేవంత్ రెడ్డి మేడారం బయలుదేరాడు. ఈరోజు నుండి హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ లోని 50 నియోజకవర్గాలలో పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నాడు రేవంత్ రెడ్డి.
ఇక మేడారం ఎందుకంటే రెండు రకాల సెంటిమెంట్ లు ఉన్నాయి. ఒకటేమో ములుగు ఎమ్మెల్యే సీతక్క తన సోదరి లాంటిది కావడమైతే…… మరొక కారణం సమ్మక్క – సారక్క లు గిరిజనుల కోసం పోరాటం చేసిన వీర నారీ మణులు కావడం. దాంతో మేడారంలో సమ్మక్క – సారక్క లను దర్శించుకొని, అమ్మవార్ల ఆశీర్వాదం తీసుకొని పాదయాత్ర ప్రారంభించనున్నాడు రేవంత్ రెడ్డి. పాదయాత్ర గా వెళ్లి పసర లో భారీ బహిరంగ సభ లో పాల్గొననున్నాడు. తెలంగాణలో ఇంకా ఎన్నికలకు 8 నెలల సమయం ఉన్నప్పటికీ అసెంబ్లీ రద్దు కాబోతోందని …… మళ్లీ ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయంటూ ఎన్నికల వేడి రాజుకుంది.
నా ప్రజాప్రస్థానంలో “యాత్ర” కీలక ఘట్టం.
సామాన్య రైతు కుటుంబంలో పుట్టాను.
ప్రజల ఆశీర్వాదంతో నాయకుడుగా ఎదిగాను. ప్రశ్నించే గొంతుకగా వారి గుండెల్లో స్థానం సంపాదించుకున్నాను.నన్ను నాయకుడ్ని చేసిన ప్రజల కోసం… వారి జీవితాల్లో మార్పు కోసం…“యాత్ర” గా వస్తున్నా.#YatraForChange pic.twitter.com/ImtXzsWhlD
— Revanth Reddy (@revanth_anumula) February 6, 2023