వైఎస్ షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఇదివరకే హైకోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో తెలంగాణ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. మేము అనుమతి ఇచ్చాక మళ్ళీ పోలీసులు అనుమతి నిరాకరించడం ఏంటి ? అని ప్రశ్నించింది. షర్మిల కు కూడా పలు సూచనలు చేసింది హైకోర్టు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని షర్మిలకు ఆదేశాలు ఙారీ చేసింది.
తెలంగాణ హైకోర్టు షర్మిల పాదయాత్రకు అనుమతి ఇవ్వడంతో త్వరలోనే కార్యాచరణ రూపొందించనుంది. ఇటీవల వరంగల్ జిల్లా పర్యటన సందర్బంగా షర్మిల కారవాన్ పై గులాబీ శ్రేణులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. పాదయాత్ర చేసుకోవచ్చు కానీ మా నాయకులపై బూతుల వర్షం కురిపిస్తే మాత్రం సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గులాబీ శ్రేణులు.