హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ రూల్స్ మారుతున్నాయి. ఇక నుండి ఇష్టానుసారం రాంగ్ రూట్ లో వెళ్తాము ……. ట్రిపుల్ రైడింగ్ చేస్తామంటే మాత్రం ట్రాఫిక్ పోలీసులు చలాన్ల పేరుతో తాట తీయడానికి సిద్ధమయ్యారు. రాంగ్ రూట్ లో వెళితే ఏకంగా 1700 రూపాయలు ఫైన్ వేయనున్నారు. అలాగే ట్రిపుల్ రైడింగ్ చేస్తే 1200 ఫైన్ వేయనున్నారు.
ఆ ……. మనం ట్రాఫిక్ పోలీసులకు దొరికినప్పుడే కదా ! డబ్బులు కట్టేది అని ఇష్టానుసారం వెళితే …… అలా ట్రాఫిక్ రూల్స్ ని అతిక్రమించి వెళ్లిన లిస్ట్ పెద్దది అయిపోయి వేలాది రూపాయలు ఫైన్ గా మారడం ఖాయం. అప్పుడు ఆ ఫైన్ కట్టే కంటే బైక్ లేదా స్కూటీ ని ట్రాఫిక్ వాళ్లకు ఫ్రీగా ఇవ్వడమే బెటర్ అనే నిర్ణయానికి రావడం ఖాయం మరి.
ఇలా భారీ జరిమానాలకు ట్రాఫిక్ పోలీసులు ఎందుకు సిద్దపడ్డారో తెలుసా …… ట్రాఫిక్ రూల్స్ పాటించే వాళ్లకు ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా అడ్డదిడ్డంగా వెళ్లేవాళ్ల వల్ల చాలా ఇబ్బందులు ఎదురౌతున్నాయి. దాంతో ట్రాఫిక్ రూల్స్ పాటించే వాళ్ల కోసం అలాగే ట్రాఫిక్ రూల్స్ ని బ్రేక్ చేసేవాళ్లను అదుపులోకి తీసుకు రావడానికి ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి హైదరాబాద్ లో తస్మాత్ జాగ్రత్త.