
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ ను తెలంగాణ పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తన కూతురు వైఎస్ షర్మిల ను పోలీసులు అరెస్ట్ చేసి ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించిన నేపథ్యంలో ఆమెను చూడటానికి ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ కు బయలుదేరింది విజయమ్మ. అయితే విజయమ్మ లోటస్ పాండ్ లోని ఇంటి నుండి బయటకు వచ్చిన వెంటనే చుట్టుముట్టిన పోలీసులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అంతేకాదు హౌజ్ అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించారు. దాంతో పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది విజయమ్మ. తన కూతురును చూడటానికి వెళ్లకుండా అడ్డుకోవడంతో ఇంటి ముందు నిరాహారదీక్ష కు దిగినట్లు ప్రకటించింది విజయమ్మ.