నేను 14 ఏళ్ల వయసులోనే వర్జినిటీని కోల్పోయానని స్పష్టం చేసి సంచలనం సృష్టించాడు కోల్ స్ప్రాస్. డిస్నీ ఛానల్ లో కిడ్ స్టార్ గా సంచలనం సృష్టించాడు కోల్. అమెరికా నటుడిగా ఫోటోగ్రాఫర్ గా సత్తా చాటిన కోల్ మిచెల్ స్ప్రాస్ కెరీర్ ప్రారంభంలో తన సోదరుడు
డిలాన్ స్ప్రాస్ తో కలిసి పలు వెంచర్ లలో నటించాడు.
తాజాగా తన వర్జినిటీ గురించి మాట్లాడి సంచలనం సృష్టించాడు కోల్. తనకు 14 ఏళ్ల వయసున్న సమయంలో సెక్స్ లో పాల్గొన్నానని , ఈ సంఘటన ఫ్లోరిడాలో జరిగిందని వెల్లడించాడు. తన రూమ్ లో ఉన్న సోదరుడిని బయటకు వెళ్లాల్సిందిగా కోరాను ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్ వస్తొందని చెప్పానని దాంతో వెళ్లిపోయాడని , ఇక తన గర్ల్ ఫ్రెండ్ రూంలోకి రావడంతో శృంగారంలో పాల్గొన్నామని అప్పుడు నా వయసు 14 అంటూ తెగ మురిసిపోయాడు. అమెరికాలో వర్జినిటీ కోల్పోవడం అంటే సహజంగానే జరిగే ప్రక్రియ లాంటిదని చెప్పడం ఎలాంటి అతిశయోక్తి లేదు. వర్జినిటీ కోల్పోకపోతేనే డేంజర్ అన్నట్లుగా ఉంటుంది అక్కడి వ్యవహారం.