ఆర్ధిక మాంద్యం ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలపై పడుతోంది. కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పలు మార్పులు సంభవించాయి. దాంతో ఆర్ధిక పురోగతి బాగా దెబ్బతింది. ఇంకేముంది ఆర్ధిక క్రమశిక్షణ పేరుతో పలు సంస్థలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అదే దారిలో HP కూడా చేరింది.
HP సంస్థలో వరల్డ్ వైడ్ గా దాదాపు 50 వేల మంది పనిచేస్తున్నారు. అందులో 4 వేల నుండి 6 వేల మందిని ఉద్యోగం లోంచి తొలగించడానికి రంగం సిద్ధం చేసిందట. దాంతో ఉద్యోగం కోల్పోతున్న వాళ్లకు న్యాయ సలహాలు ఇవ్వడానికి ఒక టీమ్ ను కూడా ఏర్పాటు చేస్తోంది HP సంస్థ. ఇక ఈ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి…… ఎవరి ఉద్యోగం ఊడుతుందో అనే భయం పట్టుకుంది.