BJP Etela Rajender : బీజేపీలో ఈటల రాజేందర్ అంశం రోజుకో ములుపు తిరుగుతున్నది. ఆయన కొంతకాలంగా పార్టీ మారుతారని చర్చ జోరుగా సాగుతున్నది. ఇటీవల పార్టీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. బీఆర్ఎస్ స్నేహహస్తం దిశగా అధిష్టానం అడుగులు వేస్తున్నదన్న ప్రచారం నేపథ్యంలో ఆయన కొంత అసంతృప్తికి గురైనట్లు సమాచారం. దీంతో పాటు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీరుపై ఆయన కొంత కాలంగా అసహనంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనూ ఆయన పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉంటున్నట్లు తెలుస్తున్నది. మరోవైపు ఈటల రాజేందర్ కాంగ్రెస్లో చేరుతారని టాక్ వినిపించింది.
అయితే పార్టీలో చేరికల కమిటీ చైర్మన్ గా ఈటల రాజేందర్ కు బాధ్యతలను అప్పగించారు. పొంగులేటి, జూపల్లి చేరికల విషయంలో ఆయన విఫలమయ్యారు. దీనికి ప్రధాన కారణం రాష్ర్టంలో ప్రస్తుతం పార్టీ పరిస్థితి. రాష్ర్టప్రభుత్వం తో పోరాడాల్సిన సమయంలో పార్టీ అస్ర్తసన్యాసం చేయడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. బీఆర్ఎస్ విషయంలో అధిష్టానం మెతకవైఖరి ఈటలతో పాటు మరికొందరు నేతలకు నచ్చడం లేదు. దీంతో ఆయన అసహనంగా ఉన్నట్లు టాక్. అయితే ఈటల తన ట్విట్టర్ అకౌంట్ లో బీజేపీ బయో తీసేసారాని, ఇక కాంగ్రెస్ లోకి వెళ్తున్నారని ప్రచారం బయటకు వచ్చింది. దీనిపై ఆయన అనుచరులు స్పందించారు. అలాంటిదేమి లేదని, ఇది కేవలం ప్రత్యర్థుల కుట్ర అని పేర్కొన్నారు. ట్విట్టర్ లో బయో అలాగే ఉందని చెప్పే ప్రయత్నం చేశారు.
ఇటీవల ఈటలకు ప్రాణహాని విషయం బయటకు రావడంతో కేంద్రం వై కేటగిరి భద్రత కల్పించేందుకు ముందుకు వచ్చింది. దీంతో అప్రమత్తమైన రాష్ర్ట ప్రభుత్వం వెంటనే రాష్ర్ట పోలీసులను ఈటెలకు భద్రతగా పంపింది. ఇప్పటికే ఏసీపీ స్థాయి వ్యక్తి ఈటల ఇంటికి వెళ్లి భద్రతా చర్యలను పర్యవేక్షించారు. స్వయంగా మంత్రి కేటీఆర్ కూడా ఈ విషక్షయమై మాట్లాడుతూ ఈటల తనకు అన్నలాంటి వాడని, కచ్చితంగా కాపాడుకుంటామని చెప్పుకొచ్చారు. ఈ విషయమై స్వయంగా డీజీపీతో మాట్లాడారు. భద్రత కల్పించాలని ఆదేశించారు.
ReplyForward
|