July Movie : సినిమాల్లో ఒకరు చేయాల్సిన సినిమా మరొకరు చేయడం సహజమే. అలా చూస్తే కలియుగ పాండవులు కృష్ణ చేయాల్సిన సినిమా కాని అనుకోకుండా వెంకటేష్ హీరోగా చేశారు. ఖైదీ సినిమా కూడా సూపర్ స్టార్ కృష్ణ చేయాల్సిందే కానీ చిరంజీవితో చేశారు. రెండు సినిమాలు కూడా ఇద్దరికి మంచి బ్లాక్ బస్టర్ హిట్లు అందించాయి. అలా ఒకరికి రావాల్సిన క్రెడిట్ మరొకరు దక్కించుకోవడం కామనే.
ఆ మధ్య అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా జులాయి. ఎంతటి వండర్ క్రియేట్ చేసిందో తెలిసిందే. అలా వారి కాంబినేషన్ లో వచ్చిన జులాయిని మొదట మహేశ్ బాబుతో తీయాలనుకున్నాట్ట. కానీ అప్పటికే వీరి కాంబినేషన్ లో ఖలేజా వచ్చి ప్లాప్ కావడంతో మహేశ్ బాబు జులాయి చేసేందుకు నో చెప్పారట. దీంతో అల్లు అర్జున్ తో తీసి హిట్ కొట్టారు.
ఇప్పుడు గుంటూరు కారం సినిమాతో మళ్లీ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా తీస్తున్నారు. సంక్రాంతి కానుకగా సినిమా విడుదల చేయాలని చూస్తున్నారు. ఇంత మంచి సినిమా మిస్ చేసుకున్న మహేశ్ బాబు అభిమానులు విషయం తెలియడంతో ఆశ్చర్యపోతున్నారు. అప్పట్లో జులాయి రూ. 43 కోట్ల వసూలు చేసి సినిమా పరిశ్రమలో సంచలనం కలిగించింది.
వారి కలయికలో వచ్చిన ఖలేజా సినిమా నిరాశ పరచడంతో మహేశ్ బాబు త్రివిక్రమ్ తో మళ్లీ చేయడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. అందుకే అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ను మిస్ చేసుకున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి ఓ మంచి అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఈ నేపథ్యంలో జులాయి అల్లు అర్జున్ కు మంచి పేరు తీసుకొచ్చింది. అలా జులాయి సినిమా ఒకరికి మోదం మరొకరికి ఖేదం కలిగించింది.
ReplyForward
|