
Marmaras
Marmaras provide : మనకు మరమరాలు మంచి ఆహారంగా చెబుతారు. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు. వీటిని బొరుగులు, ముర్ముర్లు, మురీలు అని వివిధ పేర్లతో పిలుస్తారు. మరమరాలతో భేల్ పూరీలు, లడ్డూలు, స్వీట్లు చేసుకోవచ్చు. ఇందులో విటమిన్ డి, విటమిన్ బి, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇది తేలికైన ఆహారం. కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి.
మరమరాల్లో విటమిన్ డి, బి లతోపాటు కాల్షియం, ఐరన్, థయామిన్, రిబోప్లావిన్ వంటివి ఎక్కువగా ఉంటాయి. వీటిని స్నాక్స్ గా కూడా తీసుకోవచ్చు. ఎముకలు విరిగితే వీటిని తీసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది. అధిక బరువుకు కూడా చెక్ పెడతాయి. ఎక్కువ సమయం ఆకలిని నియంత్రిస్తాయి. జంక్ ఫుడ్స్ కు బదులు వీటిని తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది.
ఇందులో మినరల్స్, విటమిన్లు,యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు, జలుబు, గొంతు నొప్పి, లంగ్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. స్నాక్ రూపంలో తీసుకోవడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మరమరాల్లో సోడియం తక్కువగా ఉండటం వల్ల అధిక రక్తపో టు నియంత్రణలో ఉంటుంది.
మరమరాల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో జీర్ణ సంబంద సమస్యలు రావు. తిన్న ఆహారాలు త్వరగా జీర్ణం కావడానికి ఇవి దోహదపడతాయి. వీటిని రోజు డైట్ లో చేర్చుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, కడుపులో మంట, విరేచనాలు, గ్యాస్, మలబద్ధకం వంట సమస్యల దూరమవుతాయి. దీంతో మరమరాలు రోజు తింటే ఎంతో ఉపశమనం కలుగుతుంది.
ReplyForward
|