
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కు గట్టి దెబ్బ తగులుతోంది. కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండి ఇటీవలే చేసిన సినిమా పఠాన్. ఈ సినిమా 2023 జనవరి 25 న విడుదల కానుంది. దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలోంచి ఇటీవల ఓ పాటను విడుదల చేసారు. ఆ పాట ఈ వివాదానికి కారణమయ్యింది.
ఈ పాటలో దీపికా పదుకోన్ వస్త్రధారణ చాలా చాలా దారుణంగా ఉంది. పాట మొత్తం టు పీస్ బికినిలో ఉంది దీపికా. అంతేకాదు దీపికా ధరించిన బికినీ రంగులు కూడా అభ్యంతరకరంగా ఉన్నాయని మండిపడుతున్నారు పలువురు నెటిజన్లు. అంతేనా …… అసలే వేసింది టు పీస్ బికినీ అయితే ఆ బికినీలో రకరకాల భంగిమల్లో కాళ్ళు అటు చాపి …… ఇటు చాపి ….. పైకెత్తి చాలా అసభ్యకరంగా ఉన్నాయి విజువల్స్.
పెళ్లి అయ్యాక దీపికా పదుకోన్ ఇంత దారుణంగా నటించడం ఏంటి ? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అలాగే పఠాన్ రాజకీయ నాయకులకు ఆగ్రహం తెప్పిస్తోందట. దాంతో సోషల్ మీడియాలో బాయ్ కాట్ పఠాన్ అంటూ ట్రెండ్ అవుతోంది. గతకొంత కాలంగా బాలీవుడ్ చిత్రాలను బాయ్ కాట్ ట్రెండ్ అనేది బాగా బాగా దెబ్బతీస్తోంది. ఇప్పటికే ఆ బాయ్ కాట్ ట్రెండ్ బారిన పలు బాలీవుడ్ చిత్రాలు పడ్డాయి. బాయ్ కాట్ అనే ట్రెండ్ ను ఎదుర్కొన్న సినిమాలు ఏవి కూడా బతికి బట్టకట్టలేదు. దాంతో పఠాన్ ఏమౌతుందో అనే భయం నెలకొంది షారుఖ్ అభిమానుల్లో.