
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మరొక హీరోయిన్ గా శ్రీలీల నటించనున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో విలన్ గా ఒకప్పటి బాలీవుడ్ సూపర్ స్టార్ సంజయ్ దత్ నటించనున్నట్లు తెలుస్తోంది.
సంజయ్ దత్ దక్షిణాది సినిమాల్లో అందునా తెలుగు సినిమాలో నటించాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు తెలుగు సినిమా అంటే కేవలం తెలుగు ప్రాంతానికి మాత్రమే పరిమితం కానీ ఇప్పుడు తెలుగు సినిమా ప్రపంచ వ్యాపంగా విడుదల అవుతోంది. దానికున్న క్రేజ్ మరో లెవల్ అనే చెప్పాలి. అందుకే తెలుగు సినిమాల్లో నటించాలని ఆశపడుతున్నాడు సంజయ్ దత్.
సరిగ్గా ఇలాంటి సమయంలోనే సంజయ్ దత్ ని అప్రోచ్ అయ్యారట దర్శకులు త్రివిక్రమ్. మహేష్ బాబు పాలిట విలన్ గా సంజయ్ దత్ నటిస్తే ఆ కాంబినేషన్ చూడటానికి ముచ్చటగా ఉంటుందని భావిస్తున్నారు. ఇక సంజయ్ దత్ కూడా ఈ సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ 3 రోజుల పాటు షూటింగ్ జరిగింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం ఖాయమని భావిస్తున్నారు.