
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం ” పఠాన్ ”. దీపికా పదుకోన్ , జాన్ అబ్రహం , డింపుల్ కపాడియా తదితరులు నటించిన ఈ చిత్రం జనవరి 25 న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా విడుదలకు ముందు పలు వివాదాలు చుట్టుముట్టాయి. కట్ చేస్తే ఆ వివాదాలను పక్కన పెట్టి భారీ ఓపెనింగ్స్ లభించాయి పఠాన్ చిత్రానికి.
కేవలం రెండు రోజుల్లోనే 219 కోట్ల వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించింది పఠాన్ చిత్రం. షారుఖ్ ఖాన్ చిత్రాల్లో నెంబర్ వన్ గా ఈ సినిమా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే ఈ వసూళ్ల జోరు చూస్తుంటే తప్పకుండా 1000 కోట్ల సినిమా అయ్యేలా కనబడుతోంది. ఈ వయసులో కూడా షారుఖ్ ఖాన్ యాక్షన్ సీన్స్ లో అదరగొట్టాడు దాంతో భారీ వసూళ్లను కట్టబెడుతున్నారు.
షారుఖ్ ఖాన్ మాత్రమే కాకుండా జాన్ అబ్రహం అలాగే దీపికా పదుకోన్ కూడా యాక్షన్ సీన్స్ లో అదరగొట్టారు. దీపికా గురించి ఎంత చెప్పినా తక్కువే ! ఎందుకంటే ఒకవైపు అందాల ఆరబోతతో పిచ్చెక్కించింది అలాగే ఇలా యాక్షన్ తో కూడా అదరగొట్టింది. మొత్తానికి షారుఖ్ ఖాన్ నాలుగేళ్ళ తర్వాత చేసిన సినిమా విడుదల అవ్వడం , బ్లాక్ బస్టర్ అవ్వడంతో అందరూ సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంది. గతకొంత కాలంగా సౌత్ సినిమాలు మాత్రమే బాలీవుడ్ లో అదరగొడుతున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ చిత్రాలకు పఠాన్ కొత్త ఊపిరి పోసాడు.