31.9 C
India
Monday, May 6, 2024
More

    Dunki Collections : ప్రభాస్ ఆ మూవీ కంటే తక్కువగానే.. ‘డంకీ’ మొదటి రోజు కలెక్షన్ ఎంతంటే?

    Date:

    Dunki Collections
    Dunki Collections

    Dunki Collections : బాలీవుడ్ లో ఉన్న పాన్ ఇండియా రేంజ్ స్టార్ లలో ముందు వరుసలో ఉన్నది షారూక్ ఖాన్ మాత్రమే. ఎంతో మంది వెనక్కు వెళ్లినా.. ఇప్పటికీ పాన్ ఇండియా మూవీస్ తీస్తూ తగ్గేదెలే అంటూ వెళ్తున్నాడు. ఈ మధ్య బాలీవుడ్ బాద్ షా ఫుల్ ఫామ్ లో ఉన్నాడని తెలుస్తూనే ఉంది. ఫుల్ ఎనర్జీతో సినిమాలపై సినిమాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే వచ్చింది. ‘డంకీ’. ఈ మూవీలో ఎమోషన్ తో పాటు నవరసాలు దట్టించాడు దర్శకుడు. కానీ దీనికి తొలి రోజే షాక్ తగిలింది.

    3 ఈడియట్స్, పీకే లాంటి భారీ సినిమాలను తీసిన డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి ‘డంకీ’ని తీశాడు. ఇక రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్స్, రాజ్ కుమార్ హిరాణీ ఫిల్స్మ్, జియో స్టూడియో బ్యానర్లపై రాగా.. గౌరీ ఖాన్, రాజ్ కుమార్ హిరాణీ, జ్యోతి దేశ్ పాండేలు నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక బాద్ షా పక్కన తాప్సీ నటించగా.. విక్కీ కౌశల్ వంటి స్టార్ లు కూడా నటించారు. ప్రీతమ్, అమాన్ సంగీతాన్ని అందించారు.

    ఈ మూవీపై బాలీవుడ్ లో స్టాటింగ్ నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక చెప్పేదేముంది మూవీ హక్కులు కూడా భారీగానే పలికాయి. దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ అంచనాలతోనే మూవీని దాదాపుగా 4000కు పైగా థియేటర్లలో డిసెంబర్ 21 (గురువారం) రిలీజ్ చేశారు. ఈ మూవీకి ఓవర్సీస్ లోని ప్రీమియర్స్ నుంచి డీసెంట్ టాక్ వచ్చింది. దీంతో ఫస్ట్ డే మోస్తరు రెస్పాన్స్ మాత్రమే వచ్చింది.

    ఫస్ట్ డే కలెక్షన్లు..
    రాజ్ కుమార్ హిరాణీ అంటే సాధారణ డైరెక్టర్ కాదు. ఆయన ఇది వరకు తీసిన సినిమాలు ఇప్పటికీ యమా క్రేజ్ మీదనే ఉన్నాయి. ఇక షారూక్ ఖాన్ తో ఆయన తీసిన ఫస్ట్ మూవీ ‘డంకీ’. ఫస్ట్ షో నుంచే మంచి టాక్ వచ్చినా.. అనుకున్నంత రీతిలో ఆడియన్స్ నుంచి స్పందన రాలేదు. దీంతో ఫస్ట్ డే కేవలం రూ. 30 కోట్లు మాత్రమే వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి.

    ఇక, వరల్డ్ వైడ్‌గా ‘డంకీ’కి రూ. 40 కోట్లు గ్రాస్ వసూలైంది. బాలీవుడ్ బాద్ షాగా గుర్తింపు ఉన్న షారూక్ ఖాన్‌కు వరల్డ్ వైడ్‌గా చాలా దేశాల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘డంకీ’ని గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఓవర్సీస్‌లో 2.5 మిలియన్ డాలర్లను (రూ. 20 కోట్లు) మాత్రమే వసూలు చేసింది. వీటిని కూడా కలిపితే ఫస్ట్ డే రూ. 60 కోట్లు గ్రాస్ మాత్రమే రాబట్టింది.

    టార్గెట్ ఎంత?
    డిఫరెంట్ కాన్సెప్ట్ తో సందేశాత్మకంగా రూపొందిన ‘డంకీ’కి రూ. 200 కోట్లు బడ్జెట్ పెట్టారు. అంతకంటే ఎక్కువగానే బిజినెస్ జరిగింది. రూ. 210 కోట్లు నెట్ టార్గెట్‌తో మేకర్స్ ఆడియన్స్ ముందుకు తెచ్చారు. ఫస్ట్ డే రూ. 30 కోట్లు రాబట్టింది. ఇంకా రూ. 180 కోట్లు వసూలు చేస్తేనే హిట్ అన్నమాట.

    ‘డంకీ’ ఫస్ట్ డే ఆశించిన దానికంటే తక్కువ వసూళ్లను రాబట్టింది. 2023లో హిందీలో ఓపెనింగ్ డేనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో 7వ స్థానాన్ని దక్కించుకుంది. ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ కంటే ఇది తక్కువ ఓపెనింగ్స్‌ వసూలు చేసింది.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas Records : రికార్డుల మోత మోగిస్తున్న ప్రభాస్.. ఏఏ సినిమా ఎంత ఎంత వసూలు చేస్తుందంటే?

    Prabhas Records : సలార్: సీజ్ ఫైర్ : ప్రభాస్ నటించిన...

    Prashant Neel : షారుఖ్ పై ప్రశాంత్ నీల్ పగబట్టాడా? వరుసగా రెండోసారి ఇలా..

    Prashant Neel : సలార్ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఇప్పటికే...

    Dunki Review : ‘డంకీ’ మూవీ రివ్యూ: సినిమా హిట్టా ఫట్టా?

    Dunki Review : షారుఖ్ ఖాన్, తాప్సీ, విక్కీ కౌశల్, బొమన్...

    Salaar Vs Dunki : సలార్, డంకీ కంపారిజన్.. బాలీవుడ్ మీడియా ఎక్స్ ట్రాలు!

    Salaar Vs Dunki : క్రిస్మస్ కానుకగా పాన్ ఇండియా లెవల్లో...