31.3 C
India
Saturday, April 27, 2024
More

    Salaar Vs Dunki : సలార్, డంకీ కంపారిజన్.. బాలీవుడ్ మీడియా ఎక్స్ ట్రాలు!

    Date:

    Salaar Vs Dunki
    Salaar Vs Dunki

    Salaar Vs Dunki : క్రిస్మస్ కానుకగా పాన్ ఇండియా లెవల్లో రెండు భారీ సినిమాలు రాబోతున్నాయి. డిసెంబర్ 21న షారుఖ్ ఖాన్ ‘డంకీ’.. 22న ప్రభాస్ ‘సలార్’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. రెండు సినిమాలకు రీసెంట్ గా అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే షారుఖ్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా బుకింగ్స్ మొదలుకాగా, సలార్ కు కొన్ని ఏరియాల్లోనే బుకింగ్స్ ఓపెన్ చేశారు.

    ఈ విషయం తెలిసి కూడా బాలీవుడ్ మీడియా.. సలార్ కంటే డంకీకే ఎక్కువ క్రేజ్ ఉందని, అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా డంకీకి ఎక్కువ వసూళ్లు వస్తున్నాయని కథనాలు వండివారుస్తున్నారు. అలాగే యూట్యూబ్ వీడియోలను సైతం వైరల్ చేస్తున్నారు.

    ఈరోజు ఉదయం నాటికి డంకీ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో 4.5 కోట్లు వసూళ్లురాగా, సలార్ కు 3.5కోట్లు వచ్చాయంటూ కథనాలు ప్రచురిస్తున్నారు. అయితే వారు విస్మరించిన విషయం ఏంటంటే ప్రభాస్ కు బాగా పట్టు ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ కాలేదు. అవి స్టార్టయితే ఏ రేంజ్ లో ఉంటాయో వారికి తెలుసు. అందుకే ముందుగానే ఈ కథనాలు పబ్లిష్ చేస్తూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.

    అయినప్పటికీ.. ఓవర్సీస్ లో సలార్ ప్రభంజనం స్పష్టంగా ఉంది. బుకింగ్ విషయంలో మిలియన్ డాలర్ క్లబ్ లో చేరిన ఈ సినిమా డంకీపై స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్లు షారుఖ్ కు ఉండడంతో డంకీకి ఉత్తరాది రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. అక్కడ సలార్ కు కొద్దిగా తక్కువ కలెక్షన్లు వస్తున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత ఈ కంపారిజన్ చేస్తే బాగుండేదని సౌత్ విశ్లేషకులు అంటున్నారు. గతంలో కూడా సౌత్ సినిమాలపై ఇష్టారీతిన కొందరు బాలీవుడ్ విమర్శకులు తమ అక్కసు వెళ్లగక్కడం తెలిసిందే.  అయితే సౌత్ సినిమాలు తమ రికార్డులతో వారి నోరు మూయిస్తున్నాయనే చెప్పాలి.

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hero Prabhas : దర్శకుల సంఘానికి.. హీరో ప్రభాస్ రూ. 35,00,00 విరాళం

    Hero Prabhas : హీరో ప్రభాస్ తెలుగు చలన చిత్ర దర్శకుల...

    Kalki Update : కల్కి మూవీ నుంచి రేపు మరో అప్ డేట్  

    Kalki Update : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్...

    Nidhi Agarwal : ఈ అందాల నిధిని ఆదుకోవాల్సింది ప్రభాసే

    Nidhi Agarwal : సినిమాల్లో ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతోందో...