28.6 C
India
Wednesday, May 8, 2024
More

    Vijayakanth : ఒక్క సంవత్సరంలోనే 18 సినిమాలు.. సినీ ఇండస్ట్రీలో ఫస్ట్ రికార్డ్ విజయ్ కాంత్ దే..

    Date:

    vijayakanth
    Tamil actor vijayakanth

    Vijayakanth : తమిళ నటుడు విజయకాంత్ (విజయ్ రాజ్ అలగర్ స్వామి) ఈ లోకాన్ని విడిచి వెళ్లడంపై ఆయన అభిమానులు, డీఎంకే (దేవీయ ముర్పొక్కు ద్రవిడ కళగం) కార్యకర్తలు కన్నీరుమున్నీరవుతున్నారు. తమిళ సినీ ఇండస్ట్రీలో అత్యంత ఆదరణ కలిగిన నటుడు ఆయన. బాల్యం నుంచే ఆయనకు బుల్లితెర, వెండితెరపై కనిపించాలనే కోరిక ఉండేది. అందుకే పెద్దగా చదువుపై శ్రద్ధ పెట్టేవారు కాదట. ఆయన ఎంజీఆర్ కు వీరాభిమాని. ఆయనను ఇన్పిరేషన్ గా తీసుకొని చెన్నైకి వచ్చారు. అక్కడ సినీ అవకాశాల కోసం చెప్పులరిగేలా తిరిగారు. ఎక్కడికి వెళ్లినా శరీర రంగును చూపి సినిమాలకు అక్కరకు రావని పంపించి వేసేవారు.

    కానీ, ఆయన ఏనాడు ప్రయత్నాలను వీడలేదు. ప్రయత్నాలను మరింత పెంచాడు. ఇందులో భాగంగా 1979లో ఎంఏ ఖాజా ఆయనకు అవకాశం ఇచ్చాడు. దీంతో ఆయన ‘ఇనిక్కమ్ ఇళమై’ అనే చిత్రంతో వెండితెరపై తెరంగేట్రం చేశారు. అయితే ఆ సినిమా దర్శకుడు ఖాజాకు విజయ్ రాజ్ పేరు అంతగా నచ్చలేదు. ఇదే కాలంలో ఇండస్ట్రీలో రజనీకాంత్ హవా కొనసాగుతోంది. దీంతో విజయ్ ని అలాగే ఉంచి రాజ్ ప్లేస్ లో కాంత్ ను జోడించి స్ర్కీన్ నేమ్ విజయ్ కాంత్ గా మార్చాడు. అప్పటి నుంచి ఆయన ఇండస్ట్రీలో విజయ్ కాంత్ గానే కొనసాగుతున్నారు.

    సినిమాలు చేయడంలో విజయ్ కాంత్ చాలా క్రమశిక్షణగా ఉండేవారు. దీంతో ఆయనకు పెద్ద నటుల సరసన కుర్చీ వేసుకుని కూర్చునే అవకాశం లభించింది. ఎన్నో బాక్సాఫీస్ మూవీస్ ను ఇచ్చారు. ఆయన పొరుగు భాష అయిన తెలుగు సినిమాల్లో కూడా నటించారు. ఆయన కెరీర్ లో 150కి పైగా మూవీస్ లో నటించారు. ఒకే సంవత్సరం (1984) ఏకంగా 18 సినిమాల్లో నటించి ఎవరూ క్రియేట్ చేయని రికార్డు సాధించారు విజయ్ కాంత్. ఆయన కెరీర్ లో ఎస్ఏ చంద్రశేఖర్, రామ నారాయణన్ దర్శకత్వంలో ఎక్కువగా నటించారు.

    Share post:

    More like this
    Related

    Postal Ballot : పోస్టల్ బ్యాలెట్ లో తప్పిదం.. అధికారులపై చర్యలు

    Postal Ballot : పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

    MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...

    Jharkhand : పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు

    Jharkhand : ఝార్ఖండ్ లో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)...

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tamil Actor : తెలుగు మార్కెట్ కు దూరం అవుతున్న తమిళ నటుడు..? కారణం ఇదే!

    Tamil Actor : ఈ తమిళ నటుడికి గతంలో తమిళం కంటే...

    Tamil Nadu : అభ్యర్థులను ప్రకటించిన డీఎంకే..

    Tamil Nadu : తమిళనాడు లో 39 లోక్ సభ సీట్లకు గాను...

    Karnataka : కర్ణాటకలో ప్రొటోకాల్ లొల్లి..

    Karnataka : తెలంగాణ తర్వాత ప్రొటోకాల్ సమస్యలు ఇప్పుడు కర్ణాటకను తాకింది....

    మనదేశంలో వారసులే రాజకీయ పార్టీల అధినేతలు

    మన దేశంలో రాజకీయ నాయకుల వారసులు ఆయా పార్టీలకు అధినేతలుగా ఉన్నారు....