
తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్ నటించిన ” ప్రిన్స్ ” చిత్రం ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈరోజు నుండి స్ట్రీమింగ్ కానుంది. జాతిరత్నాలు వంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి దర్శకత్వం వహించిన అనుదీప్ ఆ సినిమాతో సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే ఈ ప్రిన్స్.
ఈ చిత్రంలో ఉక్రెయిన్ భామ మరియా ర్యాబో షప్కా హీరోయిన్ గా నటించింది. ఎంటర్ టైన్ మెంట్ కథాంశంగా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పొందింది. కనీస ఓపెనింగ్స్ కూడా లభించలేదు తెలుగులో …… అయితే తమిళంలో మాత్రం కాస్త ఫరవాలేదు అనే చెప్పాలి.
బాక్సాఫీస్ వద్ద బాల్చీ తన్నేసిన ఈ సినిమా ఓటీటీ లో ఎలాంటి ఫలితాన్ని పొందుతుందో తెలియాలంటే రెండు , మూడు రోజులు ఎదురు చూడాల్సిందే. నవంబర్ 25 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది కాబట్టి ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తుందా ? లేదా తేలిపోనుంది.