
కన్నడ బ్లాక్ బస్టర్ సినిమా కాంతార చిత్రాన్ని చూస్తూ ఓ వ్యక్తి మరణించాడు దాంతో తీవ్ర విషాదం నెలకొంది. కన్నడ హీరో రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ” కాంతార ”. అక్టోబర్ 15 న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల అయింది. అయితే రిలీజ్ సమయంలో ఈ చిత్రంపై ఎలాంటి అంచనాలు లేవు దాంతో తక్కువ థియేటర్ లలోనే విడుదల అయ్యింది.
కాకపోతే ఈ థియేటర్లు కూడా రావడానికి కారణం KGF వంటి సంచలన చిత్రాలను నిర్మించిన సంస్థ ఈ కాంతార చిత్రాన్ని నిర్మించడమే ! అక్టోబర్ 15 న విడుదలైన ఈ చిత్రానికి యునానిమస్ గా సూపర్ హిట్ టాక్ వచ్చింది. దాంతో వెంటనే కలెక్షన్లు పెరిగాయి అలాగే పెద్ద ఎత్తున థియేటర్లు కూడా పెరిగాయి.
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 220 కోట్లను వసూల్ చేసింది ఈ చిత్రం. దాంతో ట్రేడ్ విశ్లేషకులు షాక్ అవుతున్నారు. ఒక్క తెలుగులోనే 25 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం అంటే మాటలు కాదు. కర్ణాటక లో అయితే వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ కాంతార చిత్రాన్ని చూడటానికి వచ్చిన 45 సంవత్సరాల రాజశేఖర్ అనే వ్యక్తి సినిమా చూస్తూ మరణించాడు. సడెన్ గా గుండెపోటు రావడంతో అతడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందాడని స్పష్టం చేసారు డాక్టర్లు.