39.8 C
India
Saturday, May 4, 2024
More

    Prashant Neel : ప్రశాంత్ నీల్‌పై నెగెటివ్ కామెంట్స్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన నెటిజన్.. 

    Date:

    Prashant Neel
    salaar director Prashant Neel

    Prashant Neel : ఇండియన్ డైరెక్టర్స్ లిస్ట్ లో టాప్ లో ఉండే దర్శకుడు ప్రశాంత్ నీల్. అవునండీ.. కేజీఎఫ్ నుంచి ఆయన హవా మామూలుగా లేదు. సంచలన దర్శకుడిగా రాజమౌళిని సైతం పక్కకు నెట్టిన సినీ అభిమానులు ప్రశాంత్ నీల్ కే ఓటేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన దర్శకత్వం వహించబోయే తర్వాతి సినిమాలపై ఇటు కన్నడ, తెలుగు, బాలీవుడ్ లో ఆసక్తి నెలకొంది. ఆ సినిమాలకు సంబంధించి కొన్ని విషయాలు తెలుస్తున్నాయి.

    ప్రశాంత్ నీల్ టాలీవుడ్ హీరో ప్రభాస్ తో ‘సలార్’ చేస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ రీలీజై ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మరో సినిమా, ఆ తర్వాత రామ్ చరణ్ తో ఇంకో సినిమా చేయనున్నారు. ఈ నేపథ్యంలో కన్నడ డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ తెలుగు హీరోలతో సినిమాలు చేయడంపై నెగెటివ్ కామెంట్లు విసురుతున్నారు.

    ఈ కామెంట్లపై ‘కోరా’ (సామాజిక మాద్యమం)లో ఒకవ్యక్తి ఈ విధంగా స్పందించారు.

    బడ్జెట్ పరంగా..
    బడ్జెట్ పరంగా చూసుకుంటే కన్నడ ఇండస్ట్రీ కంటే తెలుగు ఇండస్ట్రీ చాలా పెద్దది. ఇక్కడ చాలా పెద్ద నిర్మాణ సంస్థలు ఉన్నాయి. కావలసినంత బడ్జెట్ పెట్టే నిర్మాతలు కూడా ఉన్నారు.

    స్టార్‌డమ్ విషయంలో..
    కన్నడ ఇండస్ట్రీలో స్టార్ డంను పెద్దగా పట్టించుకోరు. ఒక సినిమా హిట్ అయినా కూడా తర్వాతి సినిమాకు కథ వినిపించాలంటే ఆ డైరెక్టరే నటులు, ప్రొడ్యూసర్లు, బ్యానర్ల వద్దకు వెళ్లాలి. ఇక్కడ డైరెక్టర్ ముఖ్య పాత్ర పోషిస్తారు. కానీ తెలుగు ఇండస్ట్రీలో అలాకాదు.. ఒక డైరెక్టర్ కు హిట్ పడిందంటే అతని వద్దకే ప్రొడ్యూసర్లు, బ్యానర్లు, హీరోలు తరలివెళ్తాయి. అంటే ఇక్కడ డైరెక్టర్ కు ప్రియారిటీ ఎక్కువగా ఇస్తారన్నమాట.

    తక్కువ సమయంలో కంప్లీట్
    టాలీవుడ్ లో కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకులతో కమర్షియల్ సినిమాలు చేసినా.. సుకుమార్, రాజమౌళి వంటి డైరెక్టర్లతో ప్రయోగాత్మక సినిమాలు చేస్తారు. దీనికి కారణం హీరో కమర్షియల్ సక్సెస్ మాత్రమే కాకుండా మంచి నటుడిగా గుర్తింపు ఉంటుంది.

    ఇక, ప్రశాంత్ నీల్ విషయానికి వస్తే ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు కమర్షియల్ కు పరిమితంకావు. హీరోను కొత్తగా చూపిస్తారు. సినిమాలను వేగంగా తీయగలరు. రాజమౌళి, సుకుమార్ వంటి వారు ఒక సినిమాపై చాలా సంవత్సరాలు పని చేస్తారు. అందుకే ప్రశాంత్ నీల్ తో పని చేసేందుకు నటులు ఆసక్తి చూపిస్తున్నారు.

    కన్నడ ఇండస్ట్రీకి ఆయన అవసరం ఉంది
    ప్రశాంత్ నీల్ కన్నడ ఇండస్ట్రీకి అవసరమా? అనే ప్రశ్నకు కూడా సదరు వ్యక్తి సమాధానం చెప్పాడు. ‘ఆయన కన్నడ ఇండస్ట్రీ కి అవసరం. ఆ ఇండస్ట్రీ దేశ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకునేందకు ప్రశాంత్ నీల్ బ్రాండ్ గా నిలిచారు. గ్యాంగ్‌స్టర్ డ్రామాను తెరపై రియలిస్టిక్‌గా చూపించడం ప్రశాంత్ నీల్ స్పెషాలిటీ.’ అంటూ చెప్పారు.

    Share post:

    More like this
    Related

    Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడు

    Phone Tapping Case : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్...

    Ramakrishna : రాజ్యాంగం మార్పు.. ఆ మూడు పార్టీల వైఖరి చెప్పాలి : సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ

    Ramakrishna : అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తామని బీజేపీ జాతీయ నేత...

    Pawan Sabha : పొన్నూరులో పవన్ సభ.. హెలిపాడ్ ధ్వంసం

    Pawan Sabha : గుంటూరు జిల్లా పొన్నూరులో జనసేన అధినేత పవన్...

    AP Temperature : ఏపీ ఉష్ణోగ్రతలో సరికొత్త రికార్డు

    - అత్యధికంగా నంద్యాల జిల్లాలో 47.7 డిగ్రీలు AP Temperature : ఏపీలో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Salaar 2 : సలార్ 2 అప్ డేట్.. ‘ప్రశాంత్ నీల్ ప్యాక్ చేశాడు..’: పృథ్వీ సుకుమారన్ కామెంట్స్ వైరల్

    Salaar 2 : ‘బడే మియాన్ ఛోటే మియాన్’ సినిమా విడుదలకు...

    Prabhas Friend : ఆ పాత్ర కోసం 31 కిలోలు తగ్గా: ప్రభాస్ ఫ్రెండ్ డెడికేషన్ ఇది..

    Prabhas Friend : ‘సలార్’లో వరద రాజమన్నార్ పాత్రలో నటించి...

    Movie Breaking Records : కేజీఎఫ్, పుష్ప, కాంతార రికార్డులు బద్దలు కొడుతున్న సినిమా ఏంటి?

    Movie Breaking Records : సంక్రాంతి బరిలో విడుదలైన చిన్న సినిమా...

    Prabhas : రాజమౌళితో ప్రశాంత్ నీల్ ను కంపేర్ చేసిన ప్రభాస్.. ఇద్దరిలో ఎవరు తోపంటే?

    Prabhas : ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ యంగ్ హీరో ఎవరంటే...