నందమూరి తారకరత్న కు గుండెపోటు రావడంతో కుప్పంలో ఒక్కసారిగా కుప్పకూలిన సంగతి తెలిసిందే. పల్స్ రేటు కూడా పడిపోవడంతో డాక్టర్లు పీసీఆర్ చేయగా పల్స్ కొంత బెటర్ కావడంతో చికిత్స ప్రారంభించారు. అయితే బాడీ కలర్ మారిపోవడంతో మెరుగైన చికిత్స కోసం బెంగుళూర్ తరలించాలని భావించారు. ఇక కుప్పంలోనే ఉన్న బాలయ్య తో డాక్టర్లు చర్చించిన మీదట ఈ నిర్ణయం తీసుకొని బెంగుళూర్ తరలించారు.
జనవరి 27 న నారా లోకేష్ కుప్పం నుండి పాదయాత్ర ప్రారంభించాడు. దాంతో ఆ పాదయాత్రలో పాల్గొనడానికి కుప్పం చేరుకున్నాడు నందమూరి తారకరత్న. నారా లోకేష్ తో కలిసి పాదయాత్రలో కొంతదూరం వెళ్ళాకా ఓ దర్గాలో ప్రార్ధనలు చేసారు. తిరిగి బయటకు వచ్చిన వెంటనే ఒక్కసారిగా కుప్పకూలాడు తారకరత్న. దాంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
మాసివ్ ఎటాక్ కు గురి కావడం వల్లే గుండెపోటు వచ్చిందని , అయితే ప్రాణాపాయం లేదని డాక్టర్లు తేల్చారు. దాంతో నందమూరి కుటుంబం ఊపిరి పీల్చుకుంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు , జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ తదితరులు బాలయ్యకు ఫోన్ చేసి తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.