
ఏపీ క్రీడా , సాంస్కృతిక శాఖా మంత్రి రోజా తన కూతురు అన్షు మాలిక సినిమారంగ ప్రవేశం పై స్పందించింది. తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న రోజా …… నా కూతురు సినిమాల్లోకి వస్తానంటే ఓ తల్లిగా , హీరోయిన్ గా తప్పకుండా సంతోషిస్తాను. అలాగే ఎంకరేజ్ చేస్తాను ….. కానీ అన్షు కు మాత్రం సినిమాల్లోకి రావాలని అనుకోవడం లేదు. నా కూతురు సైంటిస్ట్ కావాలని అనుకుంటోంది. ప్రస్తుతం ఆమె దృష్టి అంతా కూడా చదువుల మీదే ఉందంటోంది రోజా.
ఇప్పుడు ఆమె దృష్టి చదువు మీద ఉన్నప్పటికీ భవిష్యత్ లో హీరోయిన్ గా చేయాలని అనిపిస్తే తప్పకుండా ఆమెకు అండగా నిలబడతానని అంటోంది రోజా. అన్షు మాలిక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన ఫోటోలను పోస్ట్ చేస్తూనే ఉంటోంది. దాంతో ఆ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఇక అన్షు చాలా అందంగా ఉండటంతో ఆమె హీరోయిన్ గా నటించడం ఖాయమని , ఫలానా స్టార్ హీరో సరసన నటించనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దాంతో రోజా స్పందించింది.