మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తన బ్యానర్ అయిన ” గీత ఆర్ట్స్ ” పై ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించాడు. అయితే తన బ్యానర్ కు ఈ పేరు పెట్టడానికి కారణం రివీల్ చేసాడు. తాజాగా కమెడియన్ అలీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు అల్లు అరవింద్. కాగా ఆ షోలో తన గీత ఆర్ట్స్ బ్యానర్ కు ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో వివరించాడు.
అల్లు అరవింద్ కు గీత అనే అమ్మాయి అంటే చాలా చాలా ఇష్టమట. అయితే ఆమె అల్లు అరవింద్ ని ప్రేమించలేదు కానీ అల్లు అరవింద్ మాత్రం గీత ను చాలా బాగా ప్రేమించాడట. వన్ సైడ్ లవ్ అన్నమాట. సరిగ్గా అదే సమయంలో అల్లు రామలింగయ్య మనం ఒక నిర్మాణ సంస్థ పెడదాం…. దానికి గీత అనే పేరు పెడదాం ….. ఎందుకంటే భగవద్గీతలో మానవప్రయత్నం మనం చేయడం …… ఫలితం ఆ భగవంతుడు ఇస్తాడని సినిమాలు నిర్మించడం , బాగోగులు చూసుకోవడం మనచేతిలో పని హిట్ , ప్లాప్ అన్నవి దైవాధీనాలు కాబట్టి గీత అనే పేరు పెడదామని అన్నాడట.
దాంతో ఆపేరు పెట్టాల్సి వచ్చిందని కానీ నా మిత్రులు మాత్రం నా లవర్ పేరు గీత కాబట్టి నా బ్యానర్ పేరు గీత ఆర్ట్స్ పెట్టానని అనుకున్నారని , అందుకే ఇప్పటికి కూడా ఆట పట్టిస్తుంటారని అసలు విషయం వెల్లడించాడు. తాజాగా కాంతార అనే కన్నడ సినిమాను తెలుగులో డబ్ చేసి బాగానే సొమ్ము చేసుకున్నాడు.