Allu Aravind : అల్లు అరవింద్ గురించి తెలియని తెలుగు ప్రజలు లేరు.. ఈయన నిర్మాతగా ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్ లో రాణిస్తున్నారు.. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఎన్నో సినిమాలను నిర్మించి సక్సెస్ సాధించారు.. గీతా ఆర్ట్స్ నుండి ఒక సినిమా వస్తుంది అంటే ఖచ్చితంగా హిట్ అయినట్టే అనే గుడ్ ఇంప్రెషన్ ను అల్లు అరవింద్ తెచ్చుకున్నాడు.
అందుకే ఇన్నేళ్లు అయినా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నమ్మకం అలాగే ఉంది.. ఇక గీతా ఆర్ట్స్ ఇప్పుడు చిన్న సినిమాల మీదనే ఎక్కువ ద్రుష్టి పెట్టినట్టు అనిపిస్తుంది.. బేబీ సినిమా హిట్ అయ్యాక నిర్మాణ సంస్థలు చిన్న సినిమాపై కూడా ఫుల్ ఫోకస్ పెట్టారు.. గీతా ఆర్ట్స్ కు, బేబీ సినిమాకు ఎలాంటి సంబంధం లేకపోయినా వాటాల్లో అధిక లాభం అందుకుంది ఈ సంస్థనే అట..
పరోక్షంగా బేబీ సినిమాకు పెట్టుబడి పెట్టింది గీతా ఆర్ట్స్ నే.. అందుకే లాభాల్లో 60 శాతం వాటా దీనికి వచ్చింది.. ఈ సంస్థపై వచ్చిన చిన్న సినిమాలన్నీ ప్లాప్ అయ్యిన బేబీ మాత్రం భారీ లాభాలను అందించింది.. అందుకే ఇప్పుడు గీతా ఆర్ట్స్ మరిన్ని సినిమాలకు పెట్టుబడి పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. చిన్న చిన్న కాంబినేషన్స్ ను సెట్ చేసి తెరవెనుక పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడిని ఓటిటి హక్కులతోనే రాబట్టుకోవాలని ప్లాన్ వేస్తుంది..
ఆహా ఎలాగూ అల్లు అరవింద్ దే కావడంతో ఎవరో తీసిన సినిమాలను కొనుక్కునే కంటే చిన్న సినిమాలను తామే నిర్మించి దానికి పెట్టుబడి పెట్టు ఒటిటి హక్కులను రాయించుకోవడం మంచిదని ప్లాన్ వేసింది. ఈ సినిమాకు గీతా ఆర్ట్స్ కు ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం ఉండదు.. అయితే పబ్లిసిటీ చేసి.. హిట్ అయితే ముందుకు వస్తారు.. లాభాలు అందుకుంటారు..