
దర్శకులు త్రివిక్రమ్ ని తిట్టింది నేనే అంటూ అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు నటుడు , నిర్మాత బండ్ల గణేష్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆహ్వానించలేదని దర్శకులు త్రివిక్రమ్ పై బూతుల వర్షం కురిపించాడు బండ్ల. పవన్ కళ్యాణ్ అభిమానితో ఫోన్ లో మాట్లాడిన విషయాలు లీక్ అయ్యాయి. దాంతో అప్పుడు సంచలనంగా మారాయి ఆ మాటలు.
అయితే అప్పట్లోనే అబ్బే ! నేను ఆ మాటలు అనలేదు …… అదేదో ఫేక్ ఆడియో కావచ్చు అంటూ ఖండించాడు బండ్ల. ఈ విషయం మీడియాలో అలాగే సినీ రంగంలో తీవ్ర సంచలనం సృష్టించింది. కట్ చేస్తే తాజాగా బండ్ల గణేష్ ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ ని తిట్టింది నేనే …… అలాగే అప్పుడే క్షమాపణ కూడా చెప్పాను అంటూ సెలవిచ్చాడు.
నేను మనిషినే కదా ! మనిషన్నాక కోపం వస్తుంది …… ఆవేశంలో మాటలు అంటారు అది చాలా సహజం. తప్పు అని తెలుసుకున్నాను కాబట్టే సారీ చెప్పానని ఇక దాంతో ఆ విషయం అయిపోయిందని అంటున్నాడు. పవన్ కళ్యాణ్ ని దేవుడిగా కొలుస్తాడు బండ్ల గణేష్. అయితే తన బాస్ తో మళ్ళీ ఓ సినిమా చేయాలని కసిగా ఉన్నాడు కానీ త్రివిక్రమ్ వల్లే తనకు సినిమా చేయలేకపోతున్నాడని ఆగ్రహంతో ఉన్నాడు బండ్ల. అందువల్లే ఆ బూతుల వర్షం అన్నమాట.