Bandla Ganesh : సినీ నిర్మాత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ బండ్ల గణేష్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానాను ఒంగోలు మున్సిఫ్ కోర్టు విధించింది. బండ్ల గణేష్ 2019లో ముప్పాళ్ల గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి నుంచి రూ.95 లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ తరఫున గణేష్ అదే మొత్తానికి చెక్కు ఇచ్చాడు. చాలా సార్లు తన డబ్బులు ఇవ్వాలని అడిగినా ఆయన పట్టించుకోలేదు. దీంతో ఆయన బ్యాంకులో చెక్ వేశాడు. అది కాస్తా బౌన్స్ అయ్యింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు.
ఒంగోలు రెండో మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు వాదనలు విన్న గణేష్‌కు ఏడాది జైలుశిక్ష విధిస్తూ రూ.95 లక్షలు డిపాజిట్ చేయాలని కోరింది. అయితే, తీర్పు వెలువడిన తేదీ నుంచి నెలలోపు హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లేందుకు గణేష్‌కు కోర్టు అనుమతించింది.
అయితే ఈ ఉత్తర్వులపై ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీలు చేసుకునేందుకు ఆయనకు అనుమతి లభించింది. మరోవైపు గణేష్‌కు ఇలాంటి షాకింగ్ ఆర్డర్లు రావడం కొత్తేమి కాదు. బండ్ల గణేష్‌కు జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 15.86 లక్షల జరిమానా చెల్లించాలని 2017లో ఎర్రమంజిల్‌లోని 14వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఆయన నెలలోపు హై కోర్టులో సవాల్ చేసేందుకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది.