సాలిడ్ అందాల భామ అనుష్క త్వరలోనే పెళ్లి చేసుకోనుందని , పైగా అతడు తెలంగాణకు చెందిన బంగారు నగల వ్యాపారి అని తెలుస్తోంది. అనుష్క వయసు 42 సంవత్సరాలు. సాధారణంగా అయితే ఈపాటికి ఎప్పుడో పెళ్లి కావాలి. కానీ అనుష్క – ప్రభాస్ లు ప్రేమించుకుంటున్నారని పెళ్లి చేసుకోనున్నారని పుకార్లు షికార్లు చేసాయి.
ఆ పుకార్లకు ఊతమిచ్చేలా అటు ప్రభాస్ పెళ్లి చేసుకోలేదు ఇటు అనుష్క కూడా పెళ్లి చేసుకోలేదు దాంతో ఈ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు కాబట్టే అంటూ పుకార్లు రావడంతో మేమిద్దరం కేవలం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అంటూ వివరణ ఇచ్చారు. అయితే ఆ వివరణ ఇచ్చినప్పటికీ మీడియాలో మాత్రం కథనాలు ఆగలేదు ……. వస్తూనే ఉన్నాయి…… సీరియల్ లాగా కొనసాగుతూనే ఉన్నాయి.
ఇక ఇప్పటి విషయానికి వస్తే …… తెలంగాణకు చెందిన ఓ బంగారు నగల వ్యాపారి సంబంధాన్ని అనుష్క కుటుంబం చూసిందట. అలాగే అనుష్క కూడా వయసు మీద పడుతుండటంతో పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. అయితే ఈ వార్త నిజమా ? లేదా ? అన్నది తెలియాలంటే అనుష్క స్పందించాల్సిందే. కృష్ణంరాజు మరణంతో తీవ్ర దుఃఖసాగరంలో ఉన్న ప్రభాస్ ని ఒంటరిని చేసి అనుష్క పెళ్లి చేసుకోదు అనే మాటలు కూడా వినబడుతున్నాయి మరి.