
ప్రముఖ నటులు , ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు ఆలీ కూతురు ఫాతిమా వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇటీవలే హైదరాబాద్ లో ఫాతిమా – షేక్ షహయాజ్ ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. పలువురు సినీ ప్రముఖులు , రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
కట్ చేస్తే ……. ఈరోజు ఏపీలోని గుంటూరు లో గల శ్రీ కన్వెన్షన్ లో వివాహ రిసెప్షన్ జరిగింది. కాగా ఆ వేడుకకు ఏపీకి చెందిన రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక ప్రత్యేక ఆకర్షణగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచారు. కొత్త జంటను ఆశీర్వదించి , శుభాకాంక్షలు అందజేశారు. దాంతో ఆలీ కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది.