
నటసింహం నందమూరి బాలకృష్ణ ను ఆలింగనం చేసుకొని సీనియర్ ల పట్ల తనకున్న అభిమానాన్ని , ప్రేమను చాటుకున్నాడు డార్లింగ్ ప్రభాస్. తాజాగా బాలయ్య షో అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే షోలో పాల్గొన్నాడు ప్రభాస్. ఆ షో సందర్బంగా షో నిర్వాహకులే పెద్ద ఎత్తున వచ్చారు . అలాగే ఈ షోకోసం వచ్చిన వాళ్లు కూడా ఉంటారు కదా ! దాంతో ఎక్కువ క్రౌడ్ ఉండేసరి బాలయ్య ఎక్కడ ఉన్నాడో డార్లింగ్ ప్రభాస్ కు కనిపించలేదు.
క్రౌడ్ ఎక్కువగా ఉండటంతో ప్రభాస్ అటు ఇటు చూసుకుంటూ ఉండిపోయాడు. ఈలోగా అభిమానుల మధ్య ఉన్న బాలయ్య డార్లింగ్ ప్రభాస్ ను చూసి డార్లింగ్ ….. ఇటు రా అని పిలిచేసరికి ప్రభాస్ నవ్వుకుంటూ బాలయ్య దగ్గరకు వచ్చాడు. బాలయ్య దగ్గరకు రాగానే గట్టిగా ఆలింగనం చేసుకొని బాలయ్య పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.
ప్రస్తుతం ఈ వీడీయో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలయ్య – ప్రభాస్ ల వీడియో చక్కర్లు కొడుతోంది. అన్ స్టాపబుల్ 2 షో షూటింగ్ అయిపొయింది. ఇక న్యూ ఇయర్ కానుకగా ఈ ఎపిసోడ్ రానున్నట్లు సమాచారం. ఈ షో తప్పకుండా సంచలనం సృష్టించడం ఖాయమని భావిస్తున్నారు. డార్లింగ్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కావడంతో బాలయ్య షో మరింత పాపులర్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.