నటసింహం నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న ఆహా షోలో డార్లింగ్ ప్రభాస్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ ఎపిసోడ్ ను చిత్రీకరించారు. దాంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది. బాలయ్య నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే రికార్డుల మోత మోగిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి రికార్డుల మోత షోకు డార్లింగ్ ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ గెస్ట్ గా వస్తే రికార్డుల ఊచకోతే.
ఆ ఊచకోతకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే బాలయ్య – ప్రభాస్ న్యూస్ వైరల్ కాగా తాజాగా ఈ ఎపిసోడ్ నుండి గ్లింప్స్ రిలీజ్ చేసింది ఆహా టీమ్. ఇక ఫస్ట్ గ్లింప్స్ కు అనూహ్యమైన స్పందన వస్తోంది. బాలయ్య – ప్రభాస్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. డార్లింగ్ ప్రభాస్ డైలాగ్ వైరల్ గా మారింది. డార్లింగ్ ప్రభాస్ చెక్స్ షర్ట్ లో చూడముచ్చటగా ఉన్నాడు. దాంతో లేడీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి……. డార్లింగ్ ను ఊహించుకుంటూ గాల్లో తేలిపోతున్నారు.
బాలయ్య చేస్తున్న ఈ షో సరికొత్త చరిత్ర సృష్టించింది. మొదటి యావత్ భారతదేశంలోనే టాప్ షోగా నిలవడంతో దానికి కొనసాగింపుగా రెండో సీజన్ మొదలైంది. ఇక రెండో సీజన్ కూడా అదిరిపోయింది. బాలయ్య ఏంటి ? హోస్ట్ గా చేయడం ఏంటి ? టాక్ షో చేయడం ఏంటి ? రాంగ్ డెసీషన్ అని అనుకున్నారు కానీ అందరికీ దిమ్మతిరిగేలా బాలయ్య షో నడుస్తోంది దాంతో పలువురు సెలబ్రిటీలు ఈ షోకు వెళ్లాలని ఉత్సాహపడుతున్నారు.