31.9 C
India
Monday, May 6, 2024
More

    పవన్ కళ్యాణ్ తప్పు చేస్తున్నాడా ? ఆ కథలు ప్లాపేనా ?

    Date:

    did pawan Kalyan mistake again
    did pawan Kalyan mistake again

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తప్పు చేస్తున్నాడా ? వరుసగా సినిమాలు అంగీకరిస్తూ ఏ సినిమా ఎలా ఉండబోతోందో తెలియక తప్పు చేస్తున్నాడా ? ఇప్పుడు ఇదే వినబడుతోంది. పైగా యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో” OG ” అనే సినిమా అంగీకరించి మరింత తప్పు చేశాడా ? అనిపిస్తోంది. ఎందుకంటే OG చిత్రంలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.

    ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా నటించిన పంజా , బాలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బతిన్నాయి. బాలు అలాగే పంజా చిత్రాలపై భారీ అంచనాలు ఉండేవి. అయితే ఆ రెండు కూడా దారుణమైన పరాజయాలను మూటగట్టుకున్నాయి. 2005 లో విడుదలైన బాలు , 2011 లో విడుదలైన పంజా ఇదే విషయాన్ని రుజువు చేసాయి. ఈ రెండు చిత్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గానే నటించాడు.

    ఇక ఇప్పుడు ముచ్చటగా మూడో సారి గ్యాంగ్ స్టర్ గా అందునా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సాహో లాంటి డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడితో మరోసారి గ్యాంగ్ స్టర్ గా నటించడం అంటే సాహసమే అని చెప్పాలి. గ్యాంగ్ స్టర్ గా నటించిన చిత్రాలు ఎందుకు సక్సెస్ కావు అని పంతం పట్టి చేస్తున్న సినిమానా ? లేక ఆ సెంటిమెంట్ ను బద్దలు కొట్టడానికి చేస్తున్నాడా ? అనేది సినిమా విడుదల అయ్యాక మాత్రమే తెలిసేది.

    OG  ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. అయితే ఈ సినిమా ఎప్పుడు పూర్తి అవుతుంది ? ఎప్పుడు విడుదల అవుతుంది అన్నది చూడాలి. ప్రస్తుతానికి ఈ చిత్రానికి OG అనేది వర్కింగ్ టైటిల్ గా ఉంది. ఆర్ ఆర్ ఆర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TDP Alliance : టీడీపీ కూటమి ఘన విజయం పక్కా..చంద్రబాబు ధీమా ఇదే

    TDP alliance Win : రాబోయే ఎన్నికల్లో 160 అసెంబ్లీ, 25...

    Alliance : కాపులు కలిసి వస్తారా..! కూటమి ఏమనుకుంటుంది?

    Alliance : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల కోణాన్ని పరిశీలిస్తే రెడ్డి సామాజికవర్గం...

    Kranthi : పిఠాపురంలో పవన్ కే జై..: క్రాంతి

    Kranthi : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పద్మనాభం...

    Asaduddin Owaisi : జగన్ కు ఆ పార్టీ మద్దతు.. చంద్రబాబు.. పవన్ పై ఫైర్ అయిన పార్టీ అధినేత..

    Asaduddin Owaisi : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని ముఖ్యమైన పార్టీ...