34.5 C
India
Tuesday, April 30, 2024
More

    ఓ తండ్రి తీర్పు పోస్టర్ ఆవిష్కరించిన ప్రముఖ నిర్మాత నటులు మురళీమోహన్

    Date:

    Famous producer and actor Murali Mohan unveiled the poster of a father's verdict
    Famous producer and actor Murali Mohan unveiled the poster of a father’s verdict

    ఏవీకే ఫిలిమ్స్ బ్యానర్ పై లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్ సమర్పణ లో లయన్ శ్రీరామ్ దత్తి నిర్మిస్తున్న ఓ తండ్రి తీర్పు చిత్రం పోస్టర్ ఫస్ట్ లుక్ ప్రముఖ నటుడు నిర్మాత మురళీమోహన్ ఆవిష్కరించారు.రాజేందర్ రాజు కాంచనపల్లి పర్యవేక్షణలో ప్రతాప్ భీమవరపు దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఓ తండ్రి తీర్పు చలన చిత్రం పోస్టర్ ఆవిష్కరించిన అనంతరం

    మురళీమోహన్ మాట్లాడుతూ… ” 1985 వ సంవత్సరం జయభేరి బ్యానర్లో నేను కథానాయకుడుగా నిర్మించిన ఓ తండ్రి తీర్పు ఘన విజయం సాధించింది. నంది అవార్డు కూడా వచ్చింది. అది నా సినీ జీవితంలో ఒక మైలు రాయి.ఇప్పుడు 37 సంవత్సరాల తర్వాత మళ్లీ అదే టైటిల్ తో వస్తున్న ఓ తండ్రి తీర్పు కూడా ఘన విజయం సాధించి అవార్డ్స్ అందుకుంటుంది.ఏ వి కె ఫిలిమ్స్ ఆరిగపూడి విజయకుమార్ గారికి, నిర్మాత లయన్ శ్రీరామ్ దత్తి గారికి, దర్శకులు ప్రతాప్ భీమవరపు గారికి, చిత్ర పర్యవేక్షకులు రాజేంద్ర రాజు కాంచనపల్లి గారికి, డిఓపి సురేష్ చెట్టిపల్లి గారికి ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ .పబ్లిసిటీ డిజైనర్ వివా రెడ్డి చేసిన పోస్టర్ డిజైన్ అద్భుతంగా ఉంది “అని అన్నారు.

    నిర్మాత శ్రీరామ్ దత్తి మాట్లాడుతూ…” మురళి మోహన్ గారు సక్సెస్ ఫుల్ నిర్మాత. వారి చేతుల మీదుగా మా సినిమా పోస్టర్ ఆవిష్కరించబడటం మా అదృష్టం. నిర్మాతగా ఇది నాకు శుభ సూచకం . మురళీమోహన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.రచయిత దర్శకులు ప్రతాప్ భీమవరపు గారు తండ్రిగా ప్రధాన పాత్రలో నటిస్తూ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు.ప్రేక్షకుల ఆదరణతో లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్ గారి ఆశీస్సులతో మంచి నిర్మాతగా మంచి సినిమాలు నిర్మించాలన్నది నా ఆశయం.నా ఆశయ సాధనలో పాలుపంచుకుంటున్న రాజేంద్ర రాజు కాంచనపల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే .అప్పగించిన పని బాధ్యతగా పోటీ చేయటం మా రారాజు గొప్పతనం “అని అన్నారు.పబ్లిసిటీ డిజైనర్ వివా రెడ్డి చేసిన పోస్టర్ డిజైన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అతనిలో మంచి డిజైనరే కాదు నటుడు కూడా ఉన్నాడు. ఓ తండ్రి తీర్పు చిత్రంలో వివా రెడ్డి ఒక హీరో గా నటించడం ఒక విశేషం “
    అని అన్నారు.

    రచయిత దర్శకులు ప్రతాప్ భీమవరపు మాట్లాడుతూ…” ఈరోజు నా జీవితంలో మర్చిపోలేను. మద్రాస్ లో నా సినీ జీవితం ప్రారంభం నుంచి మురళీమోహన్ గారు నాకు ఇష్టమైన వ్యక్తి. మాదాల రంగారావు గారి విప్లవ శంఖం సినిమాకు వారితోకలిసి పని చేసాను .హీరోగా నిర్మాతగా వారు సాధించిన విజయాలు చరిత్రలో నిలిచిపోతాయి. 37 సంవత్సరాల క్రితం విడుదలైన వారి ఓ తండ్రి తీర్పు చిత్రం నాకు చాలా ఇష్టం. అందుకే అదే టైటిల్ తో ఒక కథ రాసుకొని సినిమాగా తీస్తున్నాను.వారి బ్యానర్ లో వారే హీరోగా నటించి ఘన విజయం సాధించిన ఓ తండ్రి తీర్పు సినిమాలాగే మా సినిమా కూడా ఘనవిజయం సాధిస్తుంది అనడానికి వారి చేతుల మీదుగా పోస్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ కావడం నిదర్శనం.అయ్యప్ప స్వామి మాల ధారణలో మా సినిమా పోస్టర్ ఆవిష్కరించి ఆశీర్వదించినందుకు మురళీమోహన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.అలాగే చిత్రానికి అన్ని తానై ముందు ఉండి నడిపిస్తున్న రాజేందర్ రాజు కాంచనపల్లి కి
    ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. “అని అన్నారు.

    పబ్లిసిటీ డిజైనర్ వివా రెడ్డి మాట్లాడుతూ…” జీవితంలో గుర్తుండిపోయే ఒక మంచి సినిమాకు అవకాశం ఇచ్చిన కాంచనపల్లి రాజేందర్ రాజు అన్నయ్యకి హృదయపూర్వక కృతజ్ఞతలు.సుమారు 600కు పైగా సినిమాలకు పబ్లిసిటీ డిజైనర్ గా పనిచేశాను.
    సీరియల్స్ లో సినిమాల్లో నటిస్తున్నాను.కానీ నా కెరీర్ లో ఓ తండ్రి తీర్పు లాంటి గొప్ప సినిమాకి డిజైనర్ గా పనిచేయడం, ప్రధాన పాత్రలో నటించడం కేవలం రాజేందర్ రాజు అన్నయ్య వల్ల నే సాధ్యమైంది.డిజైనర్ గా, నటుడిగా ఈ సినిమా నాకు ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది.ఇంత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాత శ్రీరామ్ దత్తి గారికి, దర్శకుడు ప్రతాప్ భీమవరపు గారికి రుణపడి ఉంటాను.
    పోస్టర్ ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించి, ఆశీర్వదించిన మురళీమోహన్ గారికి కృతజ్ఞతలు. ” అని అన్నారు.

    పర్యవేక్షకులు కాంచనపల్లి రాజేంద్ర రాజు మాట్లాడుతూ…” దైవాంశ సంభూతులు ప్రముఖ నిర్మాత దర్శకులు మురళీమోహన్ గారు ఓ తండ్రి తీర్పు పోస్టర్ ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించడం సాక్షాత్తు భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను.ఎంతో మంచి మనసుతో
    ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరిని పలకరించి ఆశీర్వదించడం వారి గొప్ప మనసుకు నిదర్శనం. నటుడిగా నిర్మాతగా వ్యాపారవేత్తగా మా తరానికి మురళీమోహన్ లాంటి వ్యక్తి ఒక స్ఫూర్తి.”అని అన్నారు.

    ప్రతాప్, శ్రీరామ్, రాజేంద్ర కుమార్, వివా రెడ్డి, కునాల్,కుషాల్, చిత్రం భాష,అనురాధ,రారాజు, సురభి శ్రావణి, పునర్వి, శివాజీ, రమ్యకృష్ణ, మంజుల, స్వాతి, జ్యోతి, కేవీఎల్ నరసింహారావు, లక్ష్మీనారాయణ,పేరిణి శ్రీకాంత్ ,గుండు బ్రదర్స్, జబర్దస్త్ నాగరాజు,మిమిక్రీ రాజు,రాము,అయ్యప్ప,ప్రమీల,అమృత వర్షిణి, సాయి చరణ్, సాయి తేజ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి

    నిర్మాత : శ్రీరామ్ దత్తి
    దర్శకత్వం : ప్రతాప్ భీమవరపు
    పర్యవేక్షణ : రాజేందర్ రాజు కాంచనపల్లి
    డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : సురేష్ చెటిపల్లి
    సంగీతం :బాపు శాస్త్రి,
    పాటలు: హరితస, బిక్కీ కృష్ణ,
    దాసరి వెంకటరమణ,
    పబ్లిసిటీ డిజైనర్: వివ రెడ్డి
    కోఆర్డినేటర్ :రాపోలు దత్తాత్రి,
    కో డైరెక్టర్ :శేషు కుమార్ , రంగనాథ్ కొత్తకోట, అసిస్టెంట్ డైరెక్టర్: బాలచందర్, మేకప్: కరుణాకర్ లక్ష్మి ,మేనేజర్: రామకృష్ణ రాజు. ఆర్ట్ డైరెక్టర్ : దుద్దిపూడి ఫణి రాజు, ప్రొడక్షన్: శివ

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TANA Meeting : తానా సన్నాహాక సమావేశంలో మురళీ మోహన్ తో యూబ్లడ్ అధినేత డాక్టర్ జగదీష్ యలిమంచిలి

    TANA Meeting : ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో తానా...

    కమ్మ – కాపు అవార్డులంటున్న పోసాని – ఆగ్రహం వ్యక్తం చేసిన మురళీమోహన్

    టాలీవుడ్ లో కమ్మ - కాపు అవార్డులు అంటూ పంచుకుంటారని ,...

    32 ఏళ్ల తర్వాత మళ్ళీ విడుదల అవుతున్న గ్యాంగ్ లీడర్

    మెగాస్టార్ చిరంజీవి , లేడీ అమితాబ్ విజయశాంతి జంటగా నటించిన బ్లాక్...

    డిసెంబర్ 24న ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారం అందుకోనున్న మురళీమోహన్, జయచిత్ర!

    ఆంధ్రుల ఆరాధ్య దైవం తెలుగు వారందరూ అన్నగారుగా పిలుచుకొనే నందమూరి తారక...