36.5 C
India
Friday, April 10, 2026
More

    కమ్మ – కాపు అవార్డులంటున్న పోసాని – ఆగ్రహం వ్యక్తం చేసిన మురళీమోహన్

    Date:

    Murali mohan fires on posani comments
    Murali mohan fires on posani comments

    టాలీవుడ్ లో కమ్మ – కాపు అవార్డులు అంటూ పంచుకుంటారని , అందుకే నాకు అవార్డ్ ప్రకటిస్తే ఆ అవార్డ్ ను తిరస్కరించానని , ఎందుకంటే నంది అవార్డుల కమిటీలో 12 మంది సభ్యులుంటే అందులో 11 మంది కమ్మవాళ్లు ఉన్నారు అందుకే నాకు వచ్చిన అవార్డును తిరస్కరించానని సంచలన వ్యాఖ్యలు చేసాడు పోసాని కృష్ణ మురళి. అయితే ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో సంచలనం సృష్టించాయి.

    పోసాని వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు సీనియర్ నటులు మురళీమోహన్. చిత్రపరిశ్రమలో కులాలు లేవని , మాదంతా సినిమా కులం అంటూ పోసాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు. ఇదివరకు చిత్ర పరిశ్రమలో కులాల ప్రస్తావన ఉండేది కాదు ఇప్పుడు మాత్రమే కులాల ప్రస్తావన తెస్తున్నారని , మా హయాంలో ప్రతిభ కలిగిన వాళ్లకు మాత్రమే అవార్డులు ఇచ్చామని అంతేకాని కమ్మ కులం , కాపు కులం అంటూ ఇవ్వలేదని ఘాటుగా స్పందించాడు.

    అంతేకాదు అసలు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నంది అవార్డులను ఏడెనిమిది సంవత్సరాలు గా ఇవ్వడం లేదు. ముందు ఆ అవార్డులు ఇవ్వాలని రెండు ప్రభుత్వాలను కోరాలని అందుకోసం ప్రయత్నించడం మానేసి ఇలా కులాల ప్రస్తావన తెచ్చి గందరగోళం సృష్టించడం ఏంటి ? అంటూ దుయ్యబట్టాడు మురళీమోహన్.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Posani : ముగిసిన పోసాని సీఐడీ కస్టడీ

    Posani : సినీ నటుడు, వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణమురళి ఒక రోజు...

    Posani : ఏపీ వ్యాప్తంగా ‘పోసాని’ని తిప్పుతున్న పోలీసులు

    Posani : పోసాని క్రిష్ణ మురళి వరుస కేసులతో పోలీస్ స్టేషన్లు .....

    Posani : పోసాని చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

    Posani : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు, నటుడు...

    Posani Krishna Murali : నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్ట్

    Posani Krishna Murali : అప్పట్లో నారా లోకేష్, చంద్రబాబుపై పోసాని కృష్ణమురళి...