ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన గోవా భామ ఇలియానా ఇప్పుడు ఐటెం సాంగ్ చేయడానికైనా రెడీ అంటూ సంకేతాలు ఇస్తోంది. అంతేకాదు పలువురు దర్శక నిర్మాతలకు ఫోన్లు చేసి ఐటెం సాంగ్ అయినా చేస్తాను …..ప్లీజ్ అని అడుగుతోందట. ఇలియానా స్వయంగా ఫోన్ చేసి అడుగుతుండటంతో కొంతమంది దర్శక నిర్మాతలు ఇలియానా కు మంచి ఆఫర్లు ఇచ్చారట. అయితే ఐటెం సాంగ్ చేయడానికి 2 కోట్ల నుండి 3 కోట్లు డిమాండ్ చేస్తోందట. దాంతో దర్శక నిర్మాతలు ఇలియానా పై ఆగ్రహంగా ఉన్నారట.
కావాలని అడిగింది…… అడిగింది కదా అని ఆఫర్ ఇస్తే ఒక్క ఐటెం సాంగ్ కు 2 కోట్లు 3 కోట్లు అని డిమాండ్ చేయడం ఏంటి ? ఒకవేళ ఆ డబ్బు ఇవ్వాలని అనుకున్నా ఈ భామకు రాను పోను ఫ్లయిట్ చార్జీలు అలాగే అసిస్టెంట్ ల ఖర్చులు , స్టార్ హోటల్ లో విడిది ఇవన్నీ తలకు మించిన భారం అని ఇలియానాకు ఐటెం సాంగ్స్ కోసం ఆఫర్ చేసిన వాళ్ళు సైలెంట్ అయిపోయారట.
ఒకప్పుడు తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ గా సత్తా చాటిన ఇలియానా టాలీవుడ్ ను వదిలేసి బాలీవుడ్ లో జెండా పాతాలని వెళ్ళింది. అయితే ఈ భామకు బాలీవుడ్ లో అంతగా ఛాన్స్ లు రాలేదు…… వచ్చినా ఆశించిన స్టార్ డం పొందలేకపోయింది. అయితే అందాలను ఆరబోయడంలో మాత్రం ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా రకరకాల భంగిమల్లో అందాలను ఆరబోసి కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టింది. ఇప్పటికి కూడా అందాలను ఆరబోస్తూనే ఉంది.