పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రానికి ఫలానా టైటిల్ అని వినబడుతోంది. ఇంతకీ ఆ టైటిల్ ఏంటో తెలుసా …… ” దేవుడు ”. అవును దేవుడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట దర్శక నిర్మాతలు. ఇక దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి మాటలు అందిస్తుండటంతో పాటుగా కథలో కొన్ని మార్పులు కూడా చేసాడట.
ఇటీవలే ఈ సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. తమిళ నటుడు , దర్శకుడు సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎందుకంటే తమిళంలో విజయం సాధించిన ” వినోదయ సీతం ” చిత్రానికి దర్శకుడు సముద్రఖని కావడమే ! ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కేవలం 20 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చాడు. ఇక ఈ 20 రోజుల కోసం పవన్ కళ్యాణ్ ఎంత తీసుకుంటున్నాడో తెలుసా …….. 80 కోట్లు. అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజమే !
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ దేవుడుగా నటించనున్నాడు. కనిపించేది కొద్దిసేపే కాబట్టి దేవుడు అనే టైటిల్ ను ఖరారు చేయాలని భావిస్తున్నారట. పవన్ కళ్యాణ్ దేవుడిగా నటిస్తుండగా భక్తుడిగా సాయిధరమ్ తేజ్ నటిస్తున్నాడు. ఇంతకుముందు గోపాల గోపాల చిత్రంలో దేవుడిగా నటించాడు పవన్. అలాగే ఈ సినిమాలో కూడా మరోసారి మోడ్రన్ దేవుడు గా నటిస్తున్నాడు. అందుకే దేవుడు అనే టైటిల్ కు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. స్క్రీన్ మీద మామా – అల్లుళ్ళు కలిసి నటిస్తే …… మెగా అభిమానుల ఆనందానికి అవధులే ఉండవు అంటే అతిశయోక్తి కాదు సుమా !.