సమంత లాగే ప్రియమణి కూడా విడాకులు తీసుకోబోతోందా ? ప్రస్తుతం ఇదే చర్చ సాగుతోంది. అంతేకాదు ఆల్రెడీ ప్రియమణి తన భర్తతో విడిపోయిందని , వేరుగా ఉంటోందని కూడా కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ గాలివార్తలే అని తెలుస్తోంది. భార్యాభర్తల మధ్య విబేధాలు ఉన్నమాట నిజమే అని …… అడపా దడపా గొడవలు అయ్యేది కూడా వాస్తవమేనని కాకపోతే విడాకులు తీసుకున్నారు అనేది మాత్రం వాస్తవం కాదని అంటున్నారు ఆమె సన్నిహితులు.
2017 లో ముస్తఫా రాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రియమణి. అప్పటికే ముస్తఫా రాజ్ కు అయేషా తో పెళ్లి అయ్యింది. ఆమెకు విడాకులు ఇవ్వకుండానే ప్రియమణిని పెళ్లి చేసుకున్నాడు ముస్తఫా రాజ్. దాంతో అయేషా ప్రియమణి పై తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే ఆమె ఎంతగా మొత్తుకున్నా ప్రియమణి మాత్రం తన భర్తకు అండగా నిలబడింది. కట్ చేస్తే ఇప్పుడేమో విడిపోయారు అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.