విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ చిత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుండగా ఈరోజే లైగర్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. అదేంటి సినిమా రేపు విడుదల అవుతుంటే ఈరోజు రివ్యూ రావడం ఏంటి ? అని షాక్ అవుతున్నారా ? ఓవర్ సీస్ సెన్సార్ సభ్యుడు , ఫిలిం క్రిటిక్ అయిన ఉమైర్ సందు ఈ రివ్యూ ఇచ్చేసాడు.
దుబాయ్ లో మన సినిమాలు రిలీజ్ కావాలంటే తప్పకుండా అక్కడ మళ్ళీ సెన్సార్ కావల్సిందే. అలా ఉమైర్ సందు లైగర్ చిత్రాన్ని చూసాడు. ఇంకేముంది తన రివ్యూ ఇచ్చేసాడు. కాకపోతే ఇంతకుముందు ప్రతీ చిత్రానికి 4 కూడా ఇచ్చేవాడు కానీ ఈ చిత్రానికి 3 రేటింగ్ మాత్రమే ఇచ్చాడు. ఈ సినిమా విజయ్ దేవరకొండ వన్ మ్యాన్ షో అంటూ కీర్తించాడు.
గతంలో ఉమైర్ సందు సూపర్ డూపర్ అంటూ రేటింగ్ ఇచ్చిన సినిమాలలో ఎక్కువగా డిజాస్టర్ లు అయ్యాయి. కొన్ని మాత్రం హిట్ , సూపర్ హిట్ అయ్యాయి. దాంతో ఇతగాడు ఇచ్చే రేటింగ్ లను పూర్తిగా నమ్మడం మానేశారు జనాలు. అయితే అభిమానులకు ఇది జోష్ కలిగించే అంశం అనే చెప్పాలి. ఇక అసలైన రివ్యూ రేపు ప్రేక్షకులు ఇవ్వనున్నారు. లైగర్ సినిమా మీద మాత్రం చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. దాంతో భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి.
Breaking News