నీవెంటే నడుస్తాను అంటూ హింట్ ఇస్తోంది హాట్ భామ నికిషా పటేల్ . ఇంతకీ ఈ భామ ఎవరి వెంట నడుస్తానని అంటోందో తెలుసా ……. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెంట. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కొమురం పులి చిత్రంలో హీరోయిన్ గా నటించింది నికిషా పటేల్ . అయితే కొమురం పులి ప్లాప్ కావడంతో పాపం ఈ భామకు ఆశించిన స్థాయిలో స్టార్ డం దక్కలేదు. అయితే కొన్ని సినిమాల్లో అవకాశాలు అయితే వచ్చాయి.
కానీ ఆ సినిమాలు ఏవి కూడా హిట్ కాలేదు దాంతో పాపం ఈ భామకు కెరీర్ లేకుండాపోయింది. ఇక అప్పటి నుండి ఉప్మా సినిమాల్లో నటిస్తూ , షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ లకు వెళ్తూ సొమ్ము చేసుకుంటోంది. తాజాగా పవన్ కళ్యాణ్ విశాఖపట్టణం వెళ్లిన సమయంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దాంతో నేను నీ వెంటే నడుస్తా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నికిషా పటేల్.