మహానటుడు ఎన్టీఆర్ బసవతారకం ని పెళ్లి చేసుకొని 12 మంది పిల్లలను కన్న విషయం తెలిసిందే. అయితే అప్పట్లో ఎన్టీఆర్ రెండో పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నాడట. ఇంతకీ ఎవరిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడో తెలుసా ……. అప్పటి స్టార్ హీరోయిన్ కృష్ణకుమారిని. ఈ విషయాన్ని ఎవరో చెప్పడం కాదు …….. కృష్ణకుమారి సోదరి సీనియర్ నటి షావుకారు జానకి.
షావుకారు జానకి , కృష్ణకుమారి ఇద్దరు కూడా అక్కాచెల్లెళ్లు. తెలుగులో ఈ ఇద్దరూ పలు చిత్రాల్లో నటించారు. కృష్ణకుమారి ఎక్కువగా ఎన్టీఆర్ సరసన నటించింది. ఆ సమయంలో ఎన్టీఆర్ – కృష్ణకుమారి ఇద్దరు కూడా ప్రేమించుకున్నారట. అప్పటికే ఎన్టీఆర్ కు పెళ్లి అవ్వడమే కాకుండా 11 మంది సంతానం కూడా. ఇంకా అప్పటికి ఎన్టీఆర్ కు చిన్న కొడుకు పుట్టలేదు. ఆ సమయంలో కృష్ణకుమారిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడట.
కృష్ణకుమారి కూడా పెళ్ళికి సిద్దపడింది. అయితే ఈ విషయం ఓ నిర్మాతకు తెలిసి ఆ పెళ్లిని చెడగొట్టాలని కృష్ణకుమారికి ఎన్టీఆర్ పై చాలా విషయాలు చెప్పాడట. దాంతో భయపడిపోయింది. అందుకే ఎన్టీఆర్ ని పెళ్లి చేసుకోకుండా సీనియర్ జర్నలిస్ట్ ని పెళ్లి చేసుకుంది. ఇక ఓ నిర్మాత షావుకారు జానకికి ఫోన్ చేసి కృష్ణకుమారి ఓ జర్నలిస్ట్ ని పెళ్లి చేసుకోవడం ఏంటి ? ఆ పెళ్లిని క్యాన్సిల్ చేయించండి అని చెప్పాడట . అందుకు షావుకారు జానకి ఒప్పుకోలేదట. దాంతో ఎన్టీఆర్ – కృష్ణకుమారి పెళ్లి ఆగిపోయిందని అంటోంది. తాజాగా షావుకారు జానకి ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పింది.
Breaking News