
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొడగొట్టాడు……. ఇంకేముంది ప్రత్యర్ధులు చిత్తయ్యారు. సాధారణంగా తొడకొట్టి సవాల్ చేయడం లాంటివి నందమూరి వంశానికి చెందిన హీరోలు ఎక్కువగా చేస్తుంటారు. మిగతా హీరోలు అంతగా ఈ తొడ కొట్టడాలు లాంటి సన్నివేశాల్లో నటించరు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు విరుద్దంగా తొడకొట్టి మరీ సవాల్ విసిరాడు …… దాంతో పవర్ స్టార్ అభిమానులు పులకించిపోవడం ఖాయం.
ఎందుకంటే మాస్ ప్రేక్షకులను ఇలాంటి సన్నివేశాలు భీకరంగా అలరిస్తాయి. ఇక పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ తొడకొడితే మరింతగా పూనకాలు రావడం ఖాయం. ఈ సినిమాకు దర్శకులు క్రిష్ . అసలు క్రిష్ ఇలాంటివి చేయలేడు కానీ బాలయ్య నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో మాత్రం బాలయ్య చేత తొడ కొట్టించాడు. ఆ సీన్ సినిమాకు హైలెట్ గా నిలిచింది. అది బాలయ్య ఐడియా కావడం క్రిష్ కు ఇష్టం లేకపోయినా పెట్టడంతో థియేటర్ లలో అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు హరిహర వీరమల్లు చిత్రంలో పవన్ కళ్యాణ్ చేత తొడ కొట్టించాడు.
ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో ఆ సందర్బంగా పవర్ గ్లాన్స్ అంటూ ఓ వీడియో విడుదల చేసారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆ వీడియో చూసి థ్రిల్ ఫీల్ అవుతున్నారు. హరిహర వీరమల్లు చిత్రం ఇప్పటి వరకు 50 శాతం మాత్రమే షూటింగ్ పూర్తి చేసుకుంది. మిగతా షూటింగ్ ఎప్పుడు పూర్తి అవుతుందో ……. ఎప్పుడు విడుదల అవుతుందో ? అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.