ఉస్తాద్ భగత్ సింగ్ ……. మనల్ని ఎవడ్రా ఆపేది అనేది ట్యాగ్ లైన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్ ఇది. గతంలో భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ను ఖరారు చేయగా దాన్ని కొంత మార్చి భవదీయుడు అంటే గౌరవంగా ఉందని భావించి గట్టిగానే ఇవ్వాలని భావించిన పవన్ కళ్యాణ్ ఆ టైటిల్ ను మార్చేశాడు. ఇప్పుడు ఆ టైటిల్ ఉస్తాద్ భగత్ సింగ్ గా మార్చారు. ఇక దీనికి ట్యాగ్ లైన్ కూడా పెట్టారు. మనల్ని ఎవడ్రా ఆపేది అనేది ట్యాగ్ లైన్.
హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈరోజు అట్టహాసంగా హైదరాబాద్ లో ఉస్తాద్ భగత్ సింగ్ ప్రారంభం అవుతోంది. అయితే రెగ్యులర్ షూటింగ్ మాత్రం వచ్చే ఏడాదిలో జరుగనుంది.