పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ప్రారంభమైంది. యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. అగ్ర నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్ లో ఈరోజు పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, దిల్ రాజు , భోగవల్లి ప్రసాద్ , కె. ఎల్ నారాయణ , ఏ ఎం రత్నం తదితరులు పాల్గొన్నారు.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటించే పలు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. హరిహర వీరమల్లు చిత్రం 70 శాతానికి పైగా పూర్తయ్యింది. ఆ సినిమా ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు. అది చాలనట్లు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ చేశారు కానీ ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. అలాగే తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా నటించే చిత్రంలో పవన్ స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నాడు. ఆ సినిమా ఎప్పుడు అవుతుందో తెలియదు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా అనుకున్నారు కానీ అది పక్కకు పోయినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడేమో సుజీత్ తో సినిమా అనౌన్స్ చేయడమే కాకుండా ఈరోజు ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు అనేది మాత్రం వెల్లడించలేదు.