
డార్లింగ్ ప్రభాస్ అభిమానులకు శుభవార్త…….. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రాజెక్ట్ – కె చిత్ర విడుదల అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఈ సినిమా విడుదల ఎప్పుడో తెలుసా……. వచ్చే ఏడాది అంటే 2024 జనవరి 12 న ప్రాజెక్ట్- కె విడుదల కానుంది. ఈమేరకు ఈరోజు అధికారికంగా వైజయంతి మూవీస్ ప్రకటించింది.
దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో project – k చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. మహానటి వంటి క్లాసిక్ బ్లాక్ బస్టర్ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. ఈ చిత్రాన్ని అశ్వనీదత్ వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మిస్తున్నారు. దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తుండగా లివింగ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Project – k చిత్రం ప్రపంచ వ్యాప్తంగా పలు భాషలలో ఏకకాలంలో విడుదల కానుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ అనూహ్యంగా పెరిగి పోవడంతో ఆ రేంజ్ లోనే ప్రభాస్ సినిమాలు రూపొందుతున్నాయి. అయితే బాహుబలి చిత్రాల తర్వాత ప్రభాస్ నటించిన చిత్రాలు అంతగా ఆడలేదు. దాంతో ప్రాజెక్ట్ – కె పై కొంత భయాలు ఉన్నప్పటికీ …… భయపడాల్సిన అవసరం లేదని అంటున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ చిత్రాన్ని 2024 జనవరి 12 న భారీ ఎత్తున విడుదల చేయనున్నట్లు ప్రకటించడంతో డార్లింగ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
𝟏𝟐-𝟏-𝟐𝟒 𝐢𝐭 𝐢𝐬! #𝐏𝐫𝐨𝐣𝐞𝐜𝐭𝐊
Happy Mahashivratri.#Prabhas @SrBachchan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/MtPIjW2cbw
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) February 18, 2023