
పుష్ప టీమ్ రష్యాలో ల్యాండ్ అయ్యింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప పాన్ ఇండియా చిత్రంగా విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో సంచలనం సృష్టించింది. దాంతో ఈ చిత్రాన్ని ఇప్పుడు రష్యాలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగానే పుష్ప ప్రమోషన్స్ కోసం రష్యా వెళ్లారు హీరో అల్లు అర్జున్ , దర్శకుడు సుకుమార్ , హీరోయిన్ రష్మిక మందన్న.
అక్కడ రష్యాలో పుష్ప ది రైజ్ చిత్రం గురించి ప్రచారం చేయనున్నారు. ప్రచార కార్యక్రమాలు పూర్తయ్యాక తిరిగి ఇండియాకు రానున్నారు. రష్యా కూడా అతిపెద్ద దేశం కావడంతో పాటుగా గంధపు చెక్కల స్మగ్లింగ్ చిత్రం కాబట్టి వాళ్లకు తప్పకుండా నచ్చుతుందనే అక్కడ కూడా విడుదల చేస్తున్నారు. ఇక రష్యాలో కూడా మన సినిమా హిట్ అయితే మరో మార్కెట్ కు తెరలేచినట్లే !