
ఆస్కార్ వేడుకల్లో తన భార్య ఉపాసన ఆరు నెలల గర్భిణీ అంటూ వెల్లడించాడు హీరో రాంచరణ్. ఈరోజు అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో ఆస్కార్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. కాగా ఆ వేడుకల్లో హీరో రాంచరణ్ తో పాటుగా భార్య ఉపాసన కూడా పాల్గొంది.
అయితే ఆస్కార్ వస్తుందని ఆశించడం వేరు , వాస్తవం వేరు కావడంతో కొంత టెన్షన్ నెలకొంది అందరిలో. కట్ చేస్తే అదే ఉద్వేగ క్షణాలను అనుభవిస్తున్నామని చెప్పింది ఉపాసన దాంతో వెంటనే జోక్యం చేసుకున్న చరణ్ తానిప్పుడు ఆరు నెలల గర్భవతిఅని బిడ్డ కడుపులో ఉండగానే మాకు ఎనలేని సంతోషాన్ని అందిస్తోందని ఉప్పొంగిపోయాడు చరణ్. ఇక నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ ప్రకటించగానే చరణ్ -ఉపాసన దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మెగాస్టార్ చిరంజీవి ఆస్కార్ అవార్డు సాధించడం పట్ల ఆర్ ఆర్ ఆర్ లో చరణ్ కూడా భాగస్వామి కావడం పట్ల పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతున్నాడు.