
సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శాకుంతలం. ఎట్టకేలకు ఈచిత్ర రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ఇంతకీ శాకుంతలం సినిమా రిలీజ్ అయ్యేది ఎప్పుడో తెలుసా …….. నవంబర్ 4 న. అవును 2022 నవంబర్ 4 న శాకుంతలం చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం.
దర్శకులు గుణశేఖర్ చాలా కాలంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దాంతో ఈ ఏడాది విడుదల అవుతుందా ? అనే సందేహం కలిగింది. అయితే గ్రాఫిక్స్ అంతా దాదాపుగా పూర్తి కావడంతో ఎట్టకేలకు రిలీజ్ డేట్ ప్రకటించారు. సమంత ఈ చిత్రంలో శకుంతలదేవిగా నటిస్తోంది. రాజకుమారి పాత్రలో నటించాలని బాగా ఆశపడింది. సరిగ్గా అలాంటి సమయంలోనే ఈ చిత్రం రావడంతో సంతోషంగా ఒప్పుకుంది.
శాకుంతలం చిత్రం భారీ బడ్జెట్ చిత్రం కావడంతో అగ్ర నిర్మాత దిల్ రాజు కూడా ఈ చిత్రాన్ని సపోర్ట్ చేస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని గుణశేఖర్ దర్శకత్వం వహించడంతో పాటుగా నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకున్నారు. తన భార్య , కూతుర్ల సహకారంతో శాకుంతలం చిత్రాన్ని పూర్తి చేసాడు. మణిశర్మ సంగీతం అందించాడు. గుణశేఖర్ పడిన కష్టానికి ప్రతిఫలం ఏంటి ? అన్నది నవంబర్ 4 న తేలనుంది.