నటసింహం నందమూరి బాలకృష్ణ ఆహా కోసం చేస్తున్న షో ” అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే ”. మొదటి సీజన్ బ్లాక్ బస్టర్ కావడంతో ఇప్పుడు రెండో సీజన్ చేస్తున్నారు. ఈ షోలో ఇప్పటికే పలువురు దర్శక నిర్మాతలు , హీరోలు , హీరోయిన్ లు వచ్చారు. ఇక ఇప్పుడేమో ముగ్గురు భామలను ఈ షో కోసం దించుతున్నారు. ముగ్గురు భామలు అనగానే అందరూ యంగ్ హీరోయిన్స్ అనుకుంటారు కానీ ఇద్దరేమో సీనియర్లు ఒక్క భామ మాత్రం యంగ్ హీరోయిన్.
ఇంతకీ ఈ ముగ్గురు ఎవరో తెలుసా ……. జయసుధ , జయప్రద , రాశి ఖన్నా. ఈ విషయాన్ని నేరుగా ఆహా టీమ్ చెప్పలేదు కానీ ఇద్దరు సీనియర్లు మరొక భామ మొత్తంగా ముగ్గురు భామలు బాలయ్య షోలో పాల్గొంటున్నారు అని ప్రకటించారు. కట్ చేస్తే విశ్వసనీయ సమాచారం ప్రకారం జయసుధ , జయప్రద , రాశి ఖన్నా అనే విషయం తెలిసింది.
బాలయ్య షోకు సూపర్ రెస్పాన్స్ వస్తుండటంతో ఆహా టీమ్ చాలా సంతోషంగా ఉంది. ఇక డార్లింగ్ ప్రభాస్ , గోపీచంద్ లతో ఇటీవలే బాలయ్య తో షో ముగించాడు. ఈ ప్రోమో కు అనూహ్య స్పందన వస్తోంది. ఈ షో డిసెంబర్ 30 న స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ ముగ్గురు భామల తో బాలయ్య షో పూర్తి అయ్యాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దర్శకులు క్రిష్ లతో బాలయ్య షో సాగనుంది. ఇక ఈ షో కూడా పిచ్చి పీక్స్ అనే లెవల్ లో సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం.