
ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ” ఆర్ ఆర్ ఆర్ ” చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడు అవార్డు అందుకున్నాడు. ఇంతకీ రాజమౌళి అందుకున్న అవార్డు ఏ సంస్థ ఇచ్చిందో తెలుసా …… ప్రతిష్టాత్మకమైన ” న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ ” ( NYFCC ) జక్కన్న ను ఉత్తమ దర్శకుడిగా సత్కరించింది. ఈ కార్యక్రమం అమెరికాలో జరుగగా భారతీయ వస్త్రధారణలో హాజరయ్యాడు జక్కన్న.
తన భార్య రామా రాజమౌళి తో కలిసి సాంప్రదాయ దుస్తుల్లో ధోతి , కుర్తా లో హాజరయ్యాడు రాజమౌళి. అంతేకాదు ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడం గర్వంగా ఉందన్నాడు. ఇంకేముంది ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. జక్కన్నకు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. భారత కీర్తి పతాకాన్ని అమెరికాలో ఎగురవేయడంతో జక్కన్న కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నాడు.
గత ఏడాది వేసవిలో విడుదలైన ఆర్ ఆర్ ఆర్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇక ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ బరిలో నిలిచింది. కొద్ది దూరంలోనే ఉంది. నాటు నాటు అనే పాట ఒరిజినల్ కేటగిరిలో నామినేట్ అయిన విషయం తెలిసిందే. షార్ట్ లిస్ట్ లో నాటు నాటు సాంగ్ ఉండటంతో తప్పకుండా ఆస్కార్ రావడం ఖాయమని భావిస్తున్నారు.
BEST DIRECTOR! ❤️🔥❤️🔥❤️🔥@ssrajamouli
@nyfcc pic.twitter.com/igF8221bqm— S S Karthikeya (@ssk1122) January 5, 2023