మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య ఘనవిజయం సాధించడంతో విజయోత్సవ సభను హన్మకొండలో ఏర్పాటు చేసారు. మెగాస్టార్ చిరంజీవి సినిమా కావడం , ఆయన స్వయంగా వస్తుండటంతో పెద్ద ఎత్తున ప్రజలు , అభిమానులు తరలివచ్చారు. హన్మకొండ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఈ సభను ఏర్పాటు చేయగా పెద్ద ఎత్తున పోలీసులు కూడా బందోబస్తు నిర్వహించారు.
అయితే పెద్ద ఎత్తున జనాలు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఒకేసారి జనాలు తోసుకు రావడంతో తొక్కిసలాట జరిగింది దాంతో చాలామంది గాయపడ్డారు. పిల్లలు , మహిళలు , యువతీయువకులు ఈ సంఘటనలో గాయపడ్డారు. గాయపడిన వాళ్ళను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అందరికి కూడా స్వల్ప గాయాలు మాత్రమే కావడంతో పోలీసులు , నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు.