మిల్కీ బ్యూటీ తమన్నా ఆ యంగ్ హీరోతో లిప్ లాక్ చేయాలని ఆశపడుతోంది. ఇంతకీ తమన్నా లిప్ లాక్ చేయాలని ఆశపడుతున్న హీరో ఎవరో తెలుసా ……. ఇంకెవరు ? రౌడీ హీరో విజయ్ దేవరకొండ. అవును విజయ్ దేవరకొండ సరసన నటించే ఛాన్స్ వస్తే ……. పెదాలను జుర్రుకునే ఛాన్స్ వస్తే వదులుకోను ……. విజయ్ దేవరకొండ పెదవులను జుర్రుకుంటాను అంటూ చెప్పి సంచలనం సృష్టించింది తమన్నా.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించాలని , అతడితో రొమాన్స్ చేయాలని చాలామంది హీరోయిన్ లు కోరుకుంటున్నారు. అర్జున్ రెడ్డి చిత్రంలో ఈ హీరో షాలిని పాండే ల మధ్య శృంగార సన్నివేశాలు పీక్స్ అనిపించేలా ఉన్న విషయం తెలిసిందే. ఆ సన్నివేశాలు కొంత జుగుప్సాకరంగా ఉన్నప్పటికీ యూత్ కు మాత్రం బాగానే నచ్చాయి.
ఇక హీరోయిన్ ల గురించి చెప్పాల్సి వస్తే …….. ఆ సన్నివేశాలు చాలా చాలా బాగా నచ్చాయి అందమైన భామలకు. అందుకే బాలీవుడ్ హీరోయిన్ లు సైతం విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేయాలని ఆశపడుతున్నారు. పలువురు హీరోయిన్ లు ఈ విషయాన్ని చెప్పగా తాజాగా ఆ లిస్ట్ లోకి తమన్నా , రాశి ఖన్నా చేరారు. ఇక తమన్నా అయితే నా బోర్డర్స్ అన్నీ క్రాస్ చేస్తాను ….. అతడితో రొమాన్స్ చేయాల్సి వస్తే అని కుండబద్దలు కొట్టింది. మొత్తానికి ఈ రౌడీ హీరో చాలామంది హీరోయిన్ లకు నిద్ర లేకుండా చేస్తున్నాడన్న మాట.